బొత్స కూతురు పెళ్లి ఎఫెక్ట్: అధికారి బదిలీ?

Botsa Satyanarayana
విశాఖపట్నం: పిసిసి అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పెళ్లి ఓ అధికారి స్థానానికి ఎసరు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా ఇంచార్జీ ఉప రవాణా కమిషనర్ జి. కృష్ణయ్యపై బదిలీ వేటు పడింది. ఆయనను ఇంచార్జీ బాధ్యతల నుంచి తప్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అనకాపల్లి ఆర్టివోగా పనిచేస్తున్న సలీమ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.

ఇటు ఉత్తర్వులు వెలువడ్డాయో లేదో అటు సలీమ్ తన బాధ్యతలు స్వీకరించారు. బొత్స సత్యనారాయణ కూతురు పెళ్లి సందర్భంగా అధికార దుర్వినియోగం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శల నుంచి తప్పించుకోవడానికే కృష్ణయ్యను బదిలీ చేశారనే విమర్సలు వస్తున్నాయి.

పెళ్లికి అతిథులను తీసుకుని వచ్చేందుకు, తీసుకుని వెళ్లేందుకు వందలాది వాహనాలను వాడారని, వాటిని రవాణా శాఖాధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. పెళ్లి జరిగి వారం రోజులు గడిచినా వాటిని స్వాధీనం చేయలేదంటూ గురువారం కొందరు యజమానులు ఆందోళనకు దిగారు.

అద్దె డబ్బులు ఇవ్వకపోవడం మాట అటుంచి, వాహనాలను కూడా ఇవ్వడం లేదంటూ గగ్గోలుమ మొదలు కావడంతో కృష్ణయ్యను బదిలీ చేసినట్లు వార్తలు వచ్చాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని ఊరికే అనలేదు కదా... బొత్స సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షుడు మాత్రమే కాదాయె, రవాణా శాఖ మంత్రి కూడానాయె...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+