కోర్కె తీర్చమంటూ బలాత్కారం చేసిన 'ల్యూక్ పోమెర్స్‌బాక్' ఎవరు...?

Luke Pomersbach
బెంగుళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఆటగాడు ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ 'ల్యూక్ పోమెర్స్‌బాక్'ని గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ - ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ అనంతరం ఐటిసి మౌర్య హోటల్‌లో జరిగిన ప్రయివేట్ పార్టీలో ఒక మహిళను తనకు కాబోయే భర్త ముందు కోర్కె తీర్చమంటూ బలవంతం చేసినందుకు గాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అసలు ఈ 'ల్యూక్ పోమెర్స్‌బాక్' ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు అందరి నోటా వినపడుతుంది.

ఆస్టేలియా క్రికెట్ ఆటగాడు 'ల్యూక్ పోమెర్స్‌బాక్'. ఐపిఎల్ 5వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరుపున క్రికెటర్. అంతక ముందు ఐపిఎల్ సీజన్లలలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆడాడు. 'ల్యూక్ పోమెర్స్‌బాక్' పూర్తి పేరు ల్యూక్ ఆంటోనీ పోమెర్స్‌బాక్. ఐపిఎల్ 4వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరుపున ఐదు గేమ్‌లలో తన ప్రదర్శనను కనబర్చాడు. 27 సంవత్సరాల వయసు కలిగిన ల్యూక్ పోమెర్స్‌బాక్ ఆస్టేలియా జాతీయ క్రికెట్లో వెస్టరన్ అస్టేలియా జట్టు తరుపున ఆడుతున్నాడు.

గతయేడాది ల్యూక్ పోమెర్స్‌బాక్ ఒత్తిడి కారణంగా సంవత్సరం పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 5వ సీజన్‌కు ముందు బెంగుళూరు ఎమ్ చిన్నసామి స్టేడియంలో మీడియాతో మాట్లాడూతూ మనం క్రికెట్ ఆడేటప్పుడు చేసినప్పుడు, కొన్నిసార్లు విరామం అనేది అవసరం. ఎందుకంటే జీవితంలో ఇతర విషయాల గురించి ఆలోచించడం అవసరం కాబట్టి అని అన్నారు. నా జీవితంలో చాలా మంది స్పెషలిస్ట్‌లను కలవడం జరిగింది. దీంతో రాబోయే కాలంలో నా కెరియర్ మరింత అభివృద్ది చెందుతుందని అన్నారు.

మీకు ఐపిఎల్ తుది జట్టులో స్దానం లభిస్తుందా అన్న ప్రశ్నకు గాను ఐపిఎల్ లో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో ఏమంత అనుభవం లేని ఆటగాళ్లతో పాటు క్రిస్ గేల్, ఎబి డెవిలియర్స్, డానియేల్ వెటోరి లాంటి అనుభవం ఉన్న ఆటగాళ్లతో డ్రస్సింగ్ రూమ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ప్రపంచంలో ఐపిఎల్ ద్వారా మంచి అనుభవాలను నేర్చుకునేందుకు చక్కని వేదికగా అభివర్ణించాడు.

ఐతే ల్యూక్ పోమెర్స్‌బాక్ ఇలాంటి సంఘటనలలో ఎదుర్కోవడం ఇదే మొదటి సారి కాదు. ఆగస్టు 2009లో మద్యపానం సేవించి ఆస్టేలియా పోలీస్ ఆఫీసర్‌ని దూషించడంతో డ్రైవింగ్ లైసెన్స్‌ని క్యాన్సిల్ చేశారు. అక్టోబర్‌లో పబ్లిక్‌లో తిరిగేందుకు ఇబ్బందిగా ఉండడంతో ఆస్టేలియా ల్యూక్ పోమెర్స్‌బాక్‌కు ఎక్ట్రా ఆర్డినరీ లైసెన్స్‌ని ఇచ్చింది. ఇలాంటి సంఘటనలతో వెస్టరన్ ఆస్టేలియా క్రికెట్ అసోసియేషన్, ల్యూక్ పోమెర్స్‌బాక్ ని సస్పెండ్ చేసింది. దీంతో సెప్టెంబర్ 2011న వెస్టరన్ ఆస్టేలియా జట్టు నుండి క్వీన్ ల్యాండ్ జట్టులో చేరాడు.

ల్యూక్ పోమెర్స్‌బాక్ ఆఫ్ స్పిన్ బౌలర్ వేయగలడు. 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ల్యూక్ పోమెర్స్‌బాక్ 2,000 పరుగులు చేశాడు. డిసెంబర్ 2011న ల్యూక్ పోమెర్స్‌బాక్ సొంత మైదానం పెర్త్‌లో న్యూజిల్యాండ్‌తో జరిగిన అంతర్జాతీయ టి20లో 15 పరుగులు చేశాడు. 35 టి20 మ్యాచ్ లాడిన ల్యూక్ పోమెర్స్‌బాక్ 623 పరుగులు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+