జూ. ఎన్టీఆర్ భయం: నారా లోకేష్ దూకుడు

Nara Lokesh - Jr Ntr
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వారసత్వ పోరులో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై ఆధిక్యత సాధించడానికే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. తన తండ్రి చంద్రబాబు పాదయాత్రను ఆసరాగా తీసుకుని లోకేష్ వ్యూహాత్మకంగా పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ తర్వాత నేతగా ముందుకు రావడానికి పునాది వేసుకుంటున్నారని అంటున్నారు.

ప్రజలు అంగీకరిస్తేనే నాయకుడు అవుతాడని, ఎవరు ఎవరిని తీసుకుని వచ్చినా ప్రజల అంగీకారం లేకపోతే ఫలితం ఉండదని చంద్రబాబు పలుమార్లు అన్నారు. నారా లోకేష్ రాజకీయ ప్రవేశంపై చంద్రబాబు అలా అంటూ వచ్చారు. ఆ మాటలను నిజం చేయడానికి లోకేష్ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. పార్టీ నాయకులు, ప్రజలు తెలుగుదేశం పార్టీ యువనేతగా తనను మాత్రమే అంగీకరించే విధంగా ఆయన కార్యకలాపాలు చేపడుతున్నట్లు చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాల్లో బిజీగా ఉన్న వేళ, పార్టీ పూర్తిగా తన తండ్రి చంద్రబాబు చేతిలో ఉన్న వేళ తాను పార్టీ పగ్గాలను చేపట్టడానికి అనువైన వాతావరణాన్ని నారా లోకేష్ కల్పించుకుంటున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ఆ క్రెడిట్‌ను కొట్టేయడానికి కూడా ముందస్తు ఏర్పాటు చేసుకుంటున్నారని అంటున్నారు.

తర్వాతి కాలంలో తన నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించకుండా చూసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉండడంతో రాజకీయాల్లో తలదూర్చే స్థితిలో లేరు. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణను బాలకృష్ణను చేరదీయడం ద్వారా చంద్రబాబు దూరం చేసుకున్నట్లేనని అంటున్నారు. ఈ స్థితిలో నారా లోకేష్‌కు అంతర్గత పోరు అంతగా లేదని అంటున్నారు. ఈ వెసులుబాటును ఆయన వాడుకుంటున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+