'జగన్‌తో స్నేహం సరే, అటు వైపు వద్దని చెప్పా'

వైయస్ జగన్‌తో తన కుమారుడి స్నేహం గురించి ఆయన గురువారం నోరు విప్పారు. అసెంబ్లీ లాబీలో ఆయన ఆ విషయం గురించి మాట్లాడారు. రాజకీయం, స్నేహం రెండూ వేర్వేరుగా ఉండాలని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు. ఆ రెండింటిని కలిపి రాజకీయం చేయరాదని ఆయన హితవు పలికారు. ఇది తన రాజకీయ జీవిత చరమాంకంలో నేర్చుకున్న పాఠమని అన్నారు.
అదే విషయాన్ని తాను తన కుమారునికి కూడా బోధించానని చెప్పారు. కాంగ్రెస్‌తో తమ కుంటుంబం అనుబంధం వందేళ్లకు పైనే అని తెలిపానని చెప్పారు. స్నేహం పేరిట ఆ అనుబంధాన్ని తెంచుకోవద్దని సూచించానని, దానిని తన కుమారుడు పాటిస్తున్నాడని చెప్పారు. తన కుమారుడు స్నేహం కోసం కాంగ్రెస్‌ను వీడటం అనేది జరగదని మంత్రి స్పష్టం చేశారు.
తన కుమారుడు తన మాట విన్నాడని కాసు వెంకటకృష్ణా రెడ్డి చెప్పారు. మిగతా కాంగ్రెసు నాయకులు, మంత్రులు ఆ విషయాన్ని అలా చెప్పగలరా అనేది అనుమానమే.












Click it and Unblock the Notifications