హిందూ-ముస్లిం బాయి: బిజెపి-మజ్లిస్ పొత్తు!

ఈ జిల్లాకు చెందిన ఊట్కూరు గ్రామంలో బిజెపి మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా భాస్కర రావు పోటీ చేశారు. ఈ గ్రామంలో ఇరు వర్గాలు ఉన్నాయి. పార్టీలు, భావజాలాలు వేరైనా బిజెపి అభ్యర్థి కోసం మజ్లిస్ పార్టీ వారు ప్రచారం చేశారు. ముస్లింలు తమ ఓటును భాస్కర రావు వేసి గెలిపించారు. భాస్కర రావు గ్రామాభివృద్ధిని కాంక్షించే వ్యక్తి అని, అందుకే ఆయనకు మద్దతిచ్చినట్లు మజ్లిస్ కార్యకర్తలు చెప్పారు.
గ్రామాన్ని హిందూ - ముస్లింలం కలిపి అభివృద్ధి చేసుకుంటామని, వినాయక చవితి వచ్చినా, మొహర్రం వచ్చిన ఇరువర్గాలం జరుపుకుంటామని వారు చెబుతున్నారు. కాగా తొలిదశలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో వివిధ పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.
పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల మద్దతుతో బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థులతో ఇతర పార్టీలు కూడా కలిసి వచ్చి గెలిపించినవి ఎన్నో ఉన్నాయి. అధికార, విపక్ష పార్టీలు ఒకరికొకరు చాలా చోట్ల సహకారించుకున్నారు.












Click it and Unblock the Notifications