రూపాయిపై రేప్ వ్యాఖ్య: చిక్కుల్లో చేతన్ భగత్

నాపై అత్యాచారం చేసిన రేపిస్టులకు శిక్ష లేదా అంటూ రూపాయి అడుగుతోందని చేతన్ భగత్ ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిజానికి, చేతన్ భగత్ నవలలు మధ్య తరగతి యువతలో చాలా ప్రాచుర్యం పొందాయి.
ముంబైలో జరిగిన ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో చేతన్ భగత్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. రూపాయి విలువ పతనం అనే అత్యంత తీవ్రమైన అంశాన్ని చేతన్ భగత్ ఆ వ్యాఖ్య ద్వారా అపహాస్యం చేశారని దుయ్యబట్టారు.
అగ్రహాన్ని చవి చూసిన భగత్ తన ట్విట్టర్‌లోంచి ఆ వ్యాఖ్యను తొలగించారు. రూపాయి పతనానికి అత్యాచారాన్ని ఉపమానంగా మాత్రమే వాడానని వివరణ ఇచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications