తుఫాన్: విభజనపై రామ్ చరణ్ ఏమన్నాడు?

సినిమా విడుదలకు తేదీ దగ్గరపడుతుండడంతో రాష్ట్ర విభజనపై ఆయన గొంతు విప్పాల్సిన పరిస్థితిలో పడ్డారని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం తన చిత్రం కన్నా గొప్పదని ఆయన వ్యాఖ్యానించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ రకంగా ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా వైఖరి తీసుకున్నట్లు చెబుతున్నారు.
దేశంలోని పెద్దలందరూ సామరస్యపూర్వక పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతూ సినిమాను సినిమాగానే చూడాలని, తన సినిమా విడుదలకు ఆటంకాలు కలిగించవద్దని ఆయన కోరారు. ప్రియాంక చోప్రాతో లిప్ లాక్ సీన్లున్నాయనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.
రామ్ చరణ్ తేజ తండ్రి, కేంద్ర మంత్రి చిరంజీవి తెలంగాణకు వ్యతిరేకంగా వైఖరి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మెగా కుటుంబ సభ్యుల సినిమాలకు తెలంగాణలో వ్యతిరేకత తప్పడం లేదు. అదే సమయంలో సమైక్యాంధ్ర కోసం తగిన రీతిలో ప్రతిస్పందించడంలో సీమాంధ్ర ప్రజలు చిరంజీవిపై మండిపడుతున్నారు. ఈ స్థితిలో రామ్ చరణ్ తేజ తుఫాన్ సినిమాను ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications