ఇనుములో హృదయం: రోబో ఆత్మహత్య
లండన్: రజనీకాంత్ సినిమాలో రోబో హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌ను ప్రేమించిన సంఘటనను చూశాం. ఇనుములో హృదయం అంటూ ఆ రోబో పాట కూడా పాడింది. రోబోకు నిజంగానే హృదయం, మనసు ఉంటాయా అని అనుమానం వచ్చే సంఘటన చోటు చేసుకుంది. పని ఒత్తిడిని కూడా అది తట్టుకోలేదా అనే సందేహం కలిగే సంఘటన అది.
ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో ఆత్మహత్య చేసుకుంది. ఇంటి పనితో విసిగిపోయి, ఒత్తిడి తట్టుకోలేక తనని తాను కాల్చుకుంది. ఇంటిని పదే పదే శుభ్రం చేయాల్సి రావడం, పని భారం పెరిగిపోవడంతో ఆ రోబో నేరుగా వెళ్లి వంట గదిలోని కుంపట్లో పడింది. దీంతో అది కాలిపోయింది. ఆస్ట్రియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటిని శుభ్రం చేయలేక అది బాగా అలసిపోయిందని స్థానికులు చెప్పుకుంటున్నారు.

'స్విచాఫ్ చేసిన ఆ రోబో ఎలాగో తిరిగి తన పని మొదలు పెట్టింది. వంటగదిని శుభ్రం చేసే క్రమంలో ఎదురుగా ఉన్న వేడి పాత్రపైకి ఎక్కింది. దీంతో రోబో అడుగు భాగం కాలిపోయింది. బాగా పొగ, మంటలు వచ్చాయి. చివరకు బూడిద మిగిలింది' అని అక్కడికొచ్చిన ఫైర్‌మాన్ వివరించారు.
తాను దాన్ని స్విచాఫ్ చేశానని, అది తిరిగి ఎలా ఆన్ అయిందో అర్థం కావడం లేదని ఇంటి యజమాని తెలిపారు. సదరు రోబో తయారీ సంస్థపై కేసు పెట్టడానికి ఆయన సిద్ధమవుతున్నారు. అయితే రోబో ఆత్మహత్య చేసుకుందన్న వార్త మాత్రం వేగంగా ప్రచారమవుతోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications