పిక్చర్స్: పచ్చపార్టీలో బాలయ్యనా, నారా లోకేషా?
హైదరాబాద్: తెలుగుదేశంలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తర్వాతి స్థానం ఎవరిదనే చర్చ సాగుతోంది. చంద్రబాబు బావమరిది బాలయ్యదా, తనయుడు నారా లోకేష్‌దా అనే వింత చర్చకు తాజాగా పాదులు పడ్డాయి. నారా లోకేష్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవలి కాలంలో విరివిగా వార్తలు పస్తున్నాయి. మరోవైపు, బాలయ్య పార్టీలో రెండో పవర్ సెంటర్‌గా ముందుకు వస్తున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా పార్టీలో నారా లోకేష్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అందరూ భావిస్తున్నారు. పార్టీ నాయకులకు ఆయన సలహాలు కూడా ఇస్తున్నారట. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను తప్పు పడుతూ, వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆయన ట్విట్టర్‌లో తనదైన శైలిలో స్పందిస్తున్నారు కూడా. ప్రజలను ఆకట్టుకోవడానికి ఎలా మాట్లాడాలో కూడా చంద్రబాబుకు ఆయన సలహాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడే తీరును ఆయన చంద్రబాబుకే కాకుండా పార్టీ నాయకులకు కూడా వివరిస్తున్నారట.
అదిలావుంటే, బాలకృష్ణ తన ఇమేజ్‌తోనే కాకుడా వయస్సు రీత్యా కూడా నారా లోకేష్ కన్నా పైస్థాయిని పొందే అవకాశాలున్నాయని అంటున్నారు. పైగా, ఎన్టీ రామారావు కుమారుడిగా బాలయ్యకు పార్టీ నాయకుల నుంచి తగిన గౌరవమర్యాదలు కూడా లభిస్తాయి. నారా లోకేష్ చంద్రబాబుకు సలహాలు మాత్రమే ఇవ్వగలిగితే బాలయ్య ఒత్తిడి తెచ్చి తగిన విధంగా వ్యవహరించగలరని, పార్టీలో ఓ వర్గం ఆయన వెంట ఉంటుందని అంటున్నారు.

బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో రెండో పవర్ సెంటర్‌గా ఎదుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలోని ఓ వర్గం బాలయ్య ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా, ఎమ్మెల్సీ టికెట్లు ఆశిస్తున్నవారు బాలయ్యను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట.

నారా చంద్రబాబు నాయుడి తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయన తనయుడు నారా లోకేష్‌కు దక్కుతాయని అందరూ ఊహిస్తున్నారు. అయితే, అల్లుడికి మామ బాలయ్య అడ్డు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

తెలుగుదేశం స్టార్ కాంపెయినర్ అనుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి తగ్గినట్లేనని భావిస్తున్నారు. ఆయన కొంత కాలం వరకు సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించే అవకాశాలున్నాయి.

చంద్రబాబుకు తన సోదరుడు బాలయ్య రాజకీయాల్లో కూడా ప్రధానమైన నాయకుడు కావడంతో నందమూరి హరికృష్ణ పక్కకు జరిగినట్లు చెబుతున్నారు. నందమూరి హరికృష్ణ భవిష్యత్తు వ్యూహమేమిటనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications