వెంకయ్య నాయుడి కూతురికి తిడుతూ కాల్స్

దీపా వెంకట్ చెన్నైలోని కాశీ థియేటర్ వద్ద విష్ణు మోటార్స్ పేర హీరో హోండా షోరూం నడుపుతున్నారు. దీపా వెంకట్ ఫిర్యాదుతో పోలీసు కమిషనర్ ఎస్ జార్జ్ సైబర్ క్రైమ్ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు.
నిందితుడిని శనివారంనాడు పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని 31 ఏళ్ల రమేష్ కుమార్‌గా గుర్తించారు. ఇంతకు ముందు మరో కేసులో కూడా రమేష్ కుమార్ అరెస్టయ్యాడు. రమేష్ కుమార్ తప్పుడు కాల్స్ చేయడానికి మల్మనీవరార్ స్ట్రీట్‌లోని సువితా కృష్ణన్ సిమ్ కార్డును వాడినట్లు పోలీసులు గుర్తించారు.
సువితా కృష్ణన్ ఏడాది క్రితం తన సిమ్ కార్డును పోగొట్టుకుంది. రమేష్ కుమార్‌ను పోలీసులు అంబత్తూరులో పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications