లోకేష్ ట్వీట్స్‌కు జగన్ పార్టీ రివర్స్ పంచ్

చంద్రబాబు తన పాదయాత్రలో వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను, ప్రకటనలను ప్రసారం చేస్తూ వాటిని విచ్ఛిన్నం చేసి చూపిస్తూ ఆపై వ్యాఖ్యలు చేరుస్తూ ఆ చిత్రీకరణ జరిగింది. అదిరిందయ్యా చంద్రం అనే కామెంట్ పలుసార్లు వినిపిస్తుంది.
అవిశ్వాస తీర్మానం విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను అపహాస్యం చేస్తూ చాలు చాలయ్యా అనే వ్యాఖ్యానం చేశారు. అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టాలో తెలియనివారు మాట్లాడుతున్నారని, శానససభ సమావేశాలు జరుగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తారని చంద్రబాబు చేసిన ప్రకటనను చూపించి, అసెంబ్లీ జరుగుతుంటే నువ్వెక్కడున్నావయ్యా చంద్రబాబు అనే వ్యాఖ్య చేశారు.
అవిశ్వాసం నే పెట్టను అని చంద్రబాబు అన్నట్లు వ్యంగ్య చిత్రం గీశారు. వస్తున్నా... మీకోసం పాదయాత్రను అపహాస్యం చేస్తూ చంద్రబాబు కుర్చీ మీద కూర్చున్న కిరణ్ కుమార్ రెడ్డిని మోస్తున్నట్లు చూపించి మోస్తున్నమీ కోసం అనే వ్యాఖ్య చేశారు. మొత్తం మీద, చంద్రబాబు మీద యూట్యూబ్‌లో పోస్టు చేసిన వీడియోలో సెటైర్ల మీద సెటైర్లు విసిరారు.












Click it and Unblock the Notifications