టైటానియం స్కాం: కెవిపిని అమెరికాకు అప్పగిస్తారా?

కెవిపి రామచందర్ రావు అప్పగింతకు అమెరికా ఇల్లినోయిస్ కోర్టు వారంట్ ఆర్డర్‌ను పాస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని అమెరికాలో ఎఫ్‌బిఐ ద్వారా ఇంటర్‌పోల్ నుంచి భారతదేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి పంపిస్తారు.
ఆ వారంట్‌ను అమలు చేయడానికి సిబిఐ డిఫెండెంట్‌ను ఢిల్లీలోని పాటియాలా ఎక్స్‌ట్రాడిషన్ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముదు హాజరు పరచాల్సి ఉంటుంది. ఆ కోర్టు ఆమోదం తెలిపిన తర్వాత విచారణ నిమిత్తం అతన్ని అమెరికాకు అప్పగిస్తారు.
అత్యంత అవసరమని భావిస్తే అమెరికా కోర్టు డిఫెండెంట్ ప్రొవిజనల్ అరెస్టుకు కూడా అమెరికా అడగవచ్చు. ఇటీవల హత్య కేసులో నిందితుడు నెరుసు లక్ష్మినివాస్ రావు విషయంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి ఇదే విధానాన్ని అనుసరించింది. అయితే కెవిపి రామచందర్ రావు కేసు అంతదాకా పోతుందా చూడాల్సిందే.












Click it and Unblock the Notifications