తండ్రి బాటలో: చిరంజీవిపై మంచు మనోజ్ సెటైర్?

Manchu Manoj's Satire On Chiranjeevi?
‌హైదరాబాద్: తెలుగు సినిమా హీరో మంచు మనోజ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో చిరంజీవిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని టాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. మనందరికీ ఈ రోజు అ ప్రశ్న ఉందని, ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా అగ్ర నాయకుడిగా ఎలా కావచ్చు అని, దయచేసి ఆచరణాత్మకంగా సమాధానం ఇవ్వండని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

అతనెవరనేది విషయం కాదని, చోటు చేసుకుంటున్న పరిణామాలు తనను అయోమయానికి గురి చేస్తున్నాయని, కేంద్రం నుంచి ఓ రాజకీయ నేత మనతో ఆడుకుంటున్నాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని, అది ఓ టీవీ ప్రోగ్రామ్ అనుకుని మనమంతా కూర్చుని చూస్తున్నామని ఆయన తన వ్యాఖ్యను పొడిగించారు.

మంచు మనోజ్ ఆ వ్యాఖ్యలను చిరంజీవిని ఉద్దేశించి చేశారని అనుమానిస్తున్నారు. అతనెవరనేది ముఖ్యం కాదని అన్నప్పటికీ కచ్చితంగా చిరంజీవికి గురి పెట్టి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తన తండ్రి మోహన్ బాబుకు చిరంజీవికి మధ్య గతంలో వాగ్యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. మంచు మనోజ్ కచ్చితంగా తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడని అనుకుంటున్నారు.

చిరంజీవి తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆయన ప్రజారాజ్యం పార్టీ కూడా ఎన్నికల్లో ఓటమిని చవి చూసింది. ఈ స్థితిలో చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి, రాజ్యసభకు వెళ్లారు. కేంద్ర మంత్రి అయ్యారు. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితిలో మంచు మనోజ్ చిరంజీవిని కాకుండా మరెవరినీ అనే అవకాశం లేదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+