అన్నయ్యపై ప్రేమ: జైరాంకు పవన్ హెచ్చరిక
హైదరాబాద్: జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో తన అన్నయ్య, కాంగ్రెసు నేత చిరంజీవిపై అమితమైన ప్రేమ కురిపించారు. తన అన్నయ్యకు ఈ పరిస్థితిని తీసుకుని వచ్చింది కాంగ్రెసు ఢిల్లీ పెద్దలేనని నిందించారు. అన్నయ్య తనకు తండ్రిలాంటివాడని, తండ్రిని ఎదిరిస్తానా, కానీ ఢిల్లీ పెద్దలు ఆ పరిస్థితి కల్పించారని ఆయన అన్నారు
చిరంజీవిపై వ్యాఖ్య చేసిన కేంద్ర మంత్రి జైరాం రమేష్‌పై ఆయన నిప్పులు చెరిగారు. మిస్టర్ జైరాం రమేష్ అని సంబోధిస్తూ ఆయన హెచ్చరిక చేశాలు. హచర కేంద్రమంత్రి అని కూడా గౌరవం లేకుండా హైదరాబాద్ నగరాన్ని యూటి చేయాలని చిరంజీవి చెబితే తలపట్టుకున్నామని జైరాం అన్నారని ఆయన విరుచుకుపడ్డారు.

జైరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు, అవకాశవాదానికి, విభజన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శమని విమర్శించారు. తన జనసేన పార్టీ ఆవిర్భావానికి కారణం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల ముందు రాష్ట్ర నాయకుల బానిస బ్రతుకులేనని స్పష్టం చేశారు.
దురదృష్టవశాత్తు అన్నయ్య తాను వ్యతిరేకిస్తున్న కాంగ్రెసు పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పెద్దలపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications