మీ మహిళల్ని రేప్ చేయిస్తానన్న తృణమూల్ నేత

TMC MP Tapas Pal's Rape Threat: Mamata 'Hopping Mad', But No Action Yet
తమ వాళ్లను బెదిరిస్తే తాను చూస్తూ ఊరుకోనని.. మీ పార్టీ మహిళలను అత్యాచారం చేయాలని మా కార్యకర్తలకు పిలుపునిస్తానని తృణమూల్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు తపస్ పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్‌కాతాలో సీపీఎం కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై వివాదం రేగుతోంది.

అయితే ఈ వివాదానికి సాధ్యమైనంత దూరంగా ఉండేందుకు తృణమూల్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తోంది. అనుభవరాహిత్యంతో తపస్ చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని టీఎంసీ నేత డెరెక్ ఓ బ్రెయిన్ అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను పార్టీ ఏమాత్రం ఉపేక్షించదన్నారు.

తపస్ నిజంగా ఈ వ్యాఖ్యలు చేసుంటే అతనిపై చర్యలు తప్పవని పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ తెలిపారు. అయితే దీనిపై తపస్ కూడా ఆ తర్వాత వివరణ ఇచ్చారు. తాను రేప్ చేయిస్తానని చెప్పలేదని, రెయిడ్ (సోదాలు) చేయిస్తానని మాత్రమే చెప్పానని వివరణ ఇస్తున్నారు. మరోవైపు, ఈ విషయమై టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం దాల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+