బాబు సీఎం అయ్యారు: అందుకే ‘వెనకడుగు’ యాత్ర

అమరావతి: తెలుగుదేశం పార్టీ అంటే అతనికి పిచ్చి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం కావాలన్న తపనతో 69 ఏళ్ల వృద్ధుడు దీక్ష బూనారు. 2004 తర్వాత చంద్రబాబు మరోమారు సీఎం కావాలని తిరుమల శ్రీవారికి ఆయన మొక్కున్నారు. ఇప్పుడు తన కోరిక ఫలించడంతో మొక్కు తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు.

అతని పేరు కొల్లూరి నాయుడమ్మ. 2009 ఎన్నికలకు ముందు ప్రకాశం జిల్లాలోని తన సొంతూరు ఇంకొల్లు నుంచి తిరుమలకు వెనకడుగు వేసుకుంటూ ఏకంగా 315 కిలో మీటర్ల యాత్ర చేశారు. అయితే నాడు నాయుడమ్మ కోరిక తీరలేదు. 2014లో ఆయన కల తీరింది.

60 old years man back walk for ap cm chandrababu naidu

దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన అన్నవరం కొండపై నుంచి తిరుమల కొండపైకి వెనకడుగు వేస్తూ మహాయాత్రకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. దాదాపు 800 కిలో మీటర్ల దూరాన్ని ఆయన వెనకడుగు వేసుకుంటూనే ముందుకు సాగుతారట. నెల రోజుల వ్యవధిలో మహాయాత్రను పూర్తి చేయాలని సంకల్పించాడు.

ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన నాయుడమ్మ నాలుగుసార్లు సర్పంచ్‌గా, మండల టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+