విరాట్ కోహ్లీకి నిరాశ: ఆస్ట్రేలియాకు అనుష్క నో?
ముంబై: ఐసిసి వన్డే ప్రపంచ కప్ సందర్భంగా భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి నిరాశే మిగిలేట్లు ఉంది. ప్రేయసి అనుష్క శర్మ ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం లేనట్లు తెలుస్తోంది. తన చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె బిజీగా ఉంది. తన చిత్రం ఎన్‌హెచ్10 ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నానని ఆమె చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తన షెడ్యూల్ ఆస్ట్రేలియాకు వెళ్లడానికి అనుమతిస్తుందా, లేదా అనేది తెలియడం లేదని ఆమె సన్నాయి నొక్కులు నొక్కింది.
ఆస్ట్రేలియాకు వెళ్లే విషయంలో కచ్చితమైన ప్రణాళిక ఏమీ లేదని, చివరి రోజుల్లో కొద్ది సమయం వెళ్తానేనమో తెలియదని అన్నది. అది కూడా అంత గ్యారంటీ లేదని చెప్పింది. అనుష్క దూరం కావడం విరాట్ కోహ్లీ ఆట తీరుపై ప్రభావం చూపుతోందని గతంలో ఉహాగానాలు చెలరేగాయి. అయితే, వాటిని ఆమె ఏమీ పట్టించుకున్నట్లు లేదు.

తాము కలిసి తిరుగుతున్నామనే విషయాన్ని తాము దాచుకోవడం లేదని ఆమె చెప్పింది. విరాట్ కోహ్లీ గానీ తాను గానీ తమ మధ్య సంబంధాన్ని రహస్యంగా ఉంచడం లేదని కూడా అంది. తమ జీవితాల పట్ల ప్రజలకు ఉండే ఆసక్తిని తాను అర్థం చేసుకోగలనని, అయితే తమ వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించవద్దని వారిని తాను కోరుతున్నానని అనుష్క శర్మ పెద్ద ఆరిందానిలా చెప్పేసింది.
విరాట్ కోహ్లీ ఇటీవల అద్భుతమైన బ్యాటింగ్ చేసిన తర్వాత అనుష్క శర్మకు గాలిలో ముద్దులు ఇవ్వడంపై తీవ్రమైన చర్చ జరిగిన విషయం తెలిసిందే. వారిద్దరు కూడా తమ మధ్య గల సంబంధాన్ని ఏ మాత్రం దాచుకోవడం లేదు.












Click it and Unblock the Notifications