ఆశ: ముంచేసిన కౌన్ బనేగా కరోడ్‌పతి కాల్
హైదరాబాద్: అత్యాశకు పోతే అంతా మునిగిపోయారు. కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు తమకు పిలుపు వస్తుందనే ఆశతో ఎదురు చూసినవారు జరిగిన మోసం తెలుసుకుని విస్తుపోయారు. కౌన్ బనేగా కరోడ్‌పతి టీమ్ మెంబర్ అంటూ చెప్పుకున్న వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినవారు కాస్తా ఆశ్చర్యపడినప్పటికీ మురిసిపోయారు. ఫోన్ నెంబర్‌ను ర్యాండమ్‌గా ఎంపిక చేసుకుని షోకు ఆహ్వానిస్తున్నట్లు అతను వారికి చెబుతూ వచ్చాడు.
ఓ వ్యక్తికి ఫోన్ చేసి సెల్ సర్వీస్ ప్రొవైడర్ ర్యాండమ్‌గా ఎంపిక చేసిన మేరకు కాల్ చేసినట్లు టీమ్ మెంబర్‌ను అంటూ చెప్పుకున్న వ్యక్తి నమ్మబలికాడు. ఎంట్రీ ఫీజు కింద 15 వేల రూపాయలు డిపాజిట్ చేయాలని కాలర్ చెప్పాడు. అలా ఫోన్ కాల్స్ అందుకున్న వ్యక్తులు 15 వేల రూపాయల చొప్పున డిపాజిట్ చేసారు.

డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత తిరిగి ఫోన్ చేస్తే అది రిజెక్ట్ కాల్ కింద ఆ వ్యక్తి సెల్‌ను పెట్టేసినట్లు తెలిసింది. మరో నెంబర్‌కు ఫోన్ చేస్తే తాము మోసపోయినట్లు తెలుసుకున్నారు. కెబిసి ప్రొడక్షన ్ టీమ్ సభ్యుడినని చెప్పుకుని అలా ఫోన్ కాల్స్ అందుకున్నవారు మోసపోయారు.
దాదాపు 30 మంది 15 వేల రూపాయల చొప్పున ఎంట్రీ ఫీజు పేరు మీద డిపాజిట్ చేశారు. అలా మోసపోయినవారు టెక్కీలు, ప్రొఫెషనల్స్, విద్యార్థులు మోసపోయినవారిలో ఉన్నారు. కాలర్ మంచి ఆంగ్లంలో, హిందీలో మాట్లాడినట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డిసిపి రవి వరమ్ చెప్పారు. ఈ కుంభకోణం వెనక ఉత్తర భారతదేశం ముఠా ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. దక్షిణ భారతదేశం ప్రజలను టార్గెట్ చేసుకోవడం వల్ల తమను పట్టుకోరనే ఉద్దేశంతో ఆ ముఠా సభ్యులు ఉండవచ్చునని అంటున్నారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications