ఆస్టేలియన్ ఓపెన్: సైనా ఓటమికి కారణం అదే?
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో ప్రపంచ నెంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్ ఓటమికి కారణం ఓ ఇండియన్ రెస్టారెంట్ అని తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె కోచ్ విమల్ కుమార్ వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే, సైనా ఓటమికి ఫుడ్ పాయిజనింగే కారణమని ఆమె కోచ్ విమల్ కుమార్ తెలిపారు. శుక్రవారం జరిగిన ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరిస్ క్వార్టర్ ఫైనల్లో చైనా ప్రత్యర్థి షిజియాన్ వాంగ్ చేతిలో పరాజయం పాలయ్యారు.

గతేడాది జరిగిన ఇదే టోర్నీ సెమీస్‌లో ఆమె పైనే విజయం సాధించింది. ఫైనల్లో కరోలినా మారిన్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మ్యాచ్‌కి ముందు సిడ్నీలోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో తిన్న ఆహారం సైనా ఆటపై ప్రభావం చూపిందని కోచ్ విమల్ కుమార్ చెప్పారు.
ఆహారం బాగాలేదని, దాని వల్ల పుడ్ పాయిజనింగ్ జరిగి సైనా కోర్టులో సరిగ్గా కదలలేకపోయిందని, అందువల్లే పరాజయం పాలైందని ఆయన పేర్కొన్నారు. ఇక, త్వరలో జరగనున్న ఇండోనేసియా ఓపెన్‌కు సైనా సన్నద్ధమవుతోంది.
జకార్తాలో జరిగే ఈ టోర్నమెంట్ రెండో రౌండ్‌లో సైనా నెహ్వాల్ మరో తెలుగు తేజం పివి. సింధుతో పోటీ పడే అవకాశం ఉంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications