వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటి కన్నా జైలు సుఖం: భార్య రోదనతో గుట్టురట్టు

|
Google Oneindia TeluguNews

అగ్రా: భారతదేశంలో దళారీల వలన కూలీలకు అన్యాయం జరుగుతున్నదనే విషయం రుజువు అయ్యింది. బయట కూలి పని చేస్తే వచ్చే డబ్బు కంటే ప్రభుత్వం జైలులో ఇచ్చే కూలి ఎక్కువ అని తెలుసుకున్న ఒక వ్యక్తి నకిలి నేరస్తుడు అయ్యాడు. నేరస్తుడి అవతారం ఎత్తి జైలుకు వెళ్లి సంపాదించడం మొదలు పెట్టాడు.

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఇతాహ్ జిల్లాలోని మియాజాన్ అనే వ్యక్తి కూలి పని చేస్తున్నాడు. ఇతను తాను బయట సంపాదించేదాని కంటే జైలులో ఎక్కువ కూలి ఇస్తారని తెలుసుకున్నాడు. రోజుకు రూ. 300 కూలి వస్తుందని ఆశపడ్డాడు.

గత నెలలో అతను పోలీసుల దగ్గరకు వెళ్లి మీరు వెతుకున్న మోస్ట్ వాంటెండ్ పర్సన్ ఇహసాన్ తానే అని చెప్పాడు. ముందుగా తయారు చేసుకుని వెళ్లి నకిలీ ఐడి కార్డు పోలీసులకు చూపించాడు. అబ్బా వెతికే కష్టం తప్పిందని భావించిన పోలీసులు గుడ్డిగా మియాజాన్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలుకు వెళ్లిన అతను రోజుకు రూ. 300 కూలి సంపాదించడం మొదలు పెట్టాడు.

Fake Prisoner in Jail

మూడు వారాల తరువాత పోలీసులు కళ్లు తెరిచారు. తాము అరెస్టు చేసింది ఇహసాన్ ను కాదని, మియాజాన్ అని తెలుసుకుని నాలుక కర్చుకున్నారు. మియాజాన్ ను చూసేందుకు అతని భార్య జైలుకు వెళ్లింది. ఎందుకు ఇలాంటి పని చేశావని భర్త దగ్గర విలపించింది.

ఎందుకు తను భర్తను జైలులో పెట్టారని పోలీసులను నిలదీస్తే వారి దగ్గర సమాధానం లేకపోయింది. మియాజాన్ బెయిల్ కోసం కోర్టులో అర్జీ సమర్పించారు. మియాజాన్ ను పోలీసులు కోర్టుకు తీసుకు వెళ్లారు. న్యాయమూర్తి ఎందుకు నీవు నేరస్తుడు అని పోలీసులకు చెప్పావు అని ప్రశ్నించారు.

కూలి డబ్బు కోసం అనద్దం చెప్పానని మియాజాన్ కోర్టులో చెప్పారు. ఇహసాన్ తో ముందుగా ఒప్పందం చేసుకుని ఇతను నకిలీ నేరస్తుడి అవతారంలో జైలుకు వెళ్లాడని తెలుసుకుని బెయిల్ ఇచ్చారు. ఇదే సమయంలో గుడ్డిగా మియాజాన్ ను జైలుకు పంపించిన పోలీసులకు న్యాయమూర్తి అక్షింతలు వేశారు.

English summary
He was a daily wage labourer, Miyajaan, who had agreed to swap places with the real criminal because he had been offered Rs 300 per day, almost twice the amount he would earn in his day job.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X