విచిత్రం: డబ్బులు చూపిస్తే కోమా నుంచి లేచాడు

బీజింగ్: చైనాలోని ఓ సైబర్ కేఫ్‌లో వ్యాపార సలహాదారుగా విధులు నిర్వహిస్తున్న జియో లీ(30) అనే వ్యక్తి పనిలో నిమగ్నమై సుమారు వారం రోజులపాటు నిద్రలేని రాత్రులు గడిపాడు. దీంతో అతడు తీవ్రంగా అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లిపోయాడు. ఇది జరిగింది ఆగస్టు 2013లో.

డబ్బును ప్రేమించే అతడు అనాటి నుంచి ఏడాదిపాటు కోమాలోనే ఉన్నాడు. అయితే షెంజెన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జియోకు అతని పరిస్థితిని గమనించిన నర్సులు ప్రయోగాత్మకంగా కొన్ని డబ్బుల నోట్లను అతని ముందుంచారు. అతని ముక్కు దగ్గరికి కొన్ని నోట్లను తీసుకెళ్లారు.

Man in coma wakes up after nurses waft cash under his nose

కాగా, జియో వెంటనే కోమాలో నుంచి బయటికి వచ్చి ఆ డబ్బులను చేతులతో పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీనిపై ఆస్పత్రి ప్రధాన వైద్యుడు డాక్టర్ లూ టంగ్ మాట్లాడుతూ.. జియోకు ఎక్కువగా ఏవంటే ఇష్టమని అతని కుటుంబసభ్యులను అడిగినప్పుడు, వారు అతనికి డబ్బులంటే ఎక్కువ ఇష్టమని చెప్పారని అన్నారు.

దీంతో అతనికి ఇష్టమైన డబ్బుతోనే ప్రయోగాత్మకంగా వైద్యం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 100 యెన్ నోట్లను అతని ముక్కు దగ్గర ఉంచగా అవి బాగానే పని చేశాయని చెప్పారు. కళ్లు పెద్దవి చేసిన జియో వెంటనే వాటిని పట్టేసుకునేందుకు ప్రయత్నించాడని తెలిపారు. తన 20ఏళ్ల వైద్య అనుభవంలో ఇలాంటి సంఘటన ఇప్పటి వరకు చూడలేదని వైద్యుడు చెప్పారు.

వాసన, ధ్వని చాలా ప్రభావితమైన జ్ఞాపకాలను తెలిపారు. జియో ఇప్పుడిప్పేడే నెమ్మదిగా కోలుకుంటున్నాడని చెప్పారు. డబ్బుపైన ఉన్న అతని ప్రేమే అతడ్ని కోమా నుంచి బయటికి తీసుకొచ్చిందని డాక్టర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+