వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

22రోజులు ఏకదాటిగా కంప్యూటర్ గేమ్: టీనేజర్ మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

మాస్కో: ఇంటర్నెట్లో ఆటకు బానిసైన ఓ యువకుడు 22 రోజుల పాటు అలాగే ఆడాడు. దీంతో, అతను ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. రష్యాలోని యుచల్లి పట్టణానికి చెందిన పదిహేడేళ్ల రుస్తంకు ఓ ప్రమాదంలో కాలు విరిగిపోయింది. దీంతో అతను ఇంటిపట్టునే ఉండవలసి వచ్చింది.

చికిత్స అనంతరం, ఆగస్టు 8న ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకు వచ్చారు. అతనిని తల్లిదండ్రులు ఓ గదిలో ఉచారు. అతనికి వైద్యులు విశ్రాంతి కావాలని చెప్పారు. దీంతో, అతనికి కావాల్సినవి అన్నీ గదిలోనే తల్లిదండ్రులు ఉంచారు. కంప్యూటర్ కూడా ఏర్పాటు చేశారు.

Russian teen dies after 22 day gaming marathon

దీంతో, అతను ఆ గదిలో నిత్యం కంప్యూటర్లో గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. 22 రోజుల పాటు అలాగే నిరంతరంగా ఆడాడు. ఎటూ కదలకుండా ఉండటంతో రక్తం గడ్డకట్టే వ్యాధఇ రెండో దశకు చేరుకోవడంతో యువకుడు మృతి చెంది ఉంటాడని వైద్యులు చెప్పారు.

అతని గది నుంచి నిత్యం కీ బోర్డు శబ్దం వచ్చింది. ఆగస్టు 30వ తేదీన అది ఆగిపోయింది. దీంతో తల్లిదండ్రులు లోపలకు వెళ్లి చూసి, అతనిని ఆసుపత్రికి తరలించారు. ఒకే ఆటకు బానిసగా మారిన రుస్తం.. గత ఏడాదిన్నర కాలంలో రెండువేల కన్నా ఎక్కువ గంటలు ఆట ఆడాడు. అతను పురాతన యుగానికి చెందిన యుద్ధ ఆటను ఆడుతూ గడిపాడు.

English summary
In a tragic incident, a Russian teenager has died after playing an online computer game for 22 days straight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X