Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సల్మాన్‌ బెయిల్‌పై సాధ్వీ ప్రాచీ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: సంచలన వ్యాఖ్యలతో తరుచుగా వివాదాలకు కేంద్రంగా మారిన బిజెపి నాయకురాలు సాధ్వీ ప్రాచీ తాజాగా బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం కాబట్టే హిట్‌ అండ్‌ రన్‌ కేసుతో సల్మాన్‌ ఖాన్‌కు బెయిల్‌ లభించిందని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారంనాడు ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు.

సల్మాన్‌ ఖాన్‌ ముస్లిం కాకుండా ఉంటే బాధితులకు న్యాయం జరిగి ఉండేదని ఆమె అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సాధ్వీ ప్రాచీని ఇప్పటికే పార్టీ నాయకత్వం ఆదేశించింది. కానీ, అలవాటు పడిన ఆమె నోరు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండడం కష్టమేనని మరోసారి నిరూపించింది.

Sadhvi Prachi

సల్మాన్‌ ఖాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తూ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌ మంజూరు కావడంతో ఆయన శుర్రవారం ఇంటికి వెళ్లారు. తనను చూడడానికి వచ్చిన అభిమానులకు ఆయన చేయి ఊపుతూ అభివాదం చేశారు.

హిందూ మహిళలు కనీసం నలుగురు పిల్లలను కనాలని, కుక్కల మాదిరిగా 30`40 మందిని కనాలని తాను చెప్పడం లేదని ఉత్తరప్రదేశ్‌లోని బాదాయూన్‌లో జరిగిన ఓ సమావేశంలో గతంలో వ్యాఖ్యానించి వివాదం సృష్టించారు. తాజాగా, సల్మాన్‌ ఖాన్‌పై ఆ వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదం సృష్టించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+