సర్ఫరాజ్ ఖాన్ జాతక బలం వెరీ స్పషల్
న్యూఢిల్లీ: ముంబై వర్ధమాన క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ కెరీర్‌కు పట్టపగ్గాలు ఉండవని, ముందుకు దూసుకుపోతాడని గ్రీన్‌స్టోన్ లోబో అనే సంఖ్యా శాస్త్ర నిపుణుడు అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-8లో 17 ఏళ్ల సర్ఫరాజ్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌పై మెరుపు ఇన్నింగ్స్‌తో అతను ఒక్కసారిగా హీరోగా మారాడు. సర్ఫరాజ్ జాతకాన్ని ఫ్లూటో ప్రభావితం చేస్తోందని, విశ్వంలో ఇది అత్యంత శక్తివంతమైదని లోబో తెలిపాడు.
అతను ప్రత్యర్ధుల మీద పైచేయి సాధిస్తాడని చెప్పాడు. సంఖ్యా శాస్త్రం ప్రకారం.. ఖాన్ జాతకం వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం క్లైవ్ లాయిడ్, సెహ్వాగ్‌తో పోలి ఉందన్నాడు. ఖాన్ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ అని అతను చెబుతున్నాడు. కపిల్ దేవ్‌కు పోలిన జాతకం కూడా సర్ఫరాజ్ ఖాన్‌కు ఉందట.

వారి జాతకాల ప్రకారం లాయిడ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటివారిలో ఒకే వ్యక్తిలో పలువురి శక్తులు ఉంటాయని లోబో అంటున్నాడు. ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్న సర్ఫరాజ్ ఆ ప్రశంసలకు న్యాయం చేస్తాడని చెబుతున్నాడు. సర్ఫరాజ్ దిగ్గజ ఆటగాడు అవుతాడని లోబో అంటున్నాడు. ఊహకు అందనంతగా ఖాన్ ఎదిగిపోతాడని కూడా అంటున్నాడు. అసాధరమైన రీతిలో దూసుకుపోతాడని, తనను నమ్మాలని లోబో అంటున్నాడు.
సర్ఫరాజ్ ఖాన్ పలు రికార్డులు సృష్టిస్తాడని కూడా చెబుతున్నాడు. సుదీర్ఘకాలం క్రికెట్ క్రీడలో రాణిస్తాడని అంటున్నాడు. క్రికెట్ దేవుళ్లు సర్ఫరాజ్ పక్కన ఉన్నారని లోబో చెబుతున్నాడు. ఖాన్ భారతీయుడు కావడం అృష్టమని చెబుతున్నారు
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications