‘మగవారికి దూరంగా ఉండండి..వందేళ్లు బతకండి’

లండన్: వందేళ్లు బతకాలనుకునే ఆడవాళ్లు పురుషులతో శృంగారానికి దూరంగా ఉండాలని ఓ బ్రిటన్ బామ్మ సలహా ఇస్తున్నారు. పురుషులకు దూరంగా ఉంటే సుధీర్ఘ కాలం జీవించవచ్చని పేర్కొంటున్నారు. బ్రిటన్‌కు చెందిన 109ఏళ్ల బ్రహ్మచారిణి జెస్సీ గల్లాన్... సుదీర్ఘకాలం జీవించాలనుకుంటే పురుషులకు (శృంగారానికి) దూరంగా ఉండాలని మహిళలకు హితబోధ చేస్తున్నారు.

తాను సుదీర్ఘకాలం ఆరోగ్యంతో ఉండటానికి కారణం పురుషులకు దూరంగా ఉండటం, గంజీ తాగడమేనని ఆమె సీక్రెట్‌ను వెల్లడించారు. స్కాట్లాండ్‌లోని అబెర్డీన్‌లో జెస్సీ జనవరి 2న తన 109వ జన్మదినాన్ని జరుపుకున్నారు. అంతేకాకుండా ఎక్కువకాలం బతకాలనుకునే వాళ్లు గంజి తాగాలని సూచించారు.

Secret to long life is avoiding MEN claims 109-year-old woman

ప్రతి రోజు ఉదయం వ్యాయామంతోపాటు, వెచ్చని గంజి తాగుతానని, పెళ్లి గురించి ఎన్నడూ ఆలోచించలేదని ఆమె అన్నారు. పేదరికంతో పుట్టిన జెస్సీ 13 ఏళ్లేకే ఇంటి నుంచి బయటకు వచ్చి పాలు సరఫరా చేస్తూ జీవితం గడిపారు.

ప్రస్తుతం స్కాట్లండ్‌లోఅత్యధిక వయస్సున్న వ్యక్తిగా ఘనతతోపాటు బ్రిటన్‌లో సుదీర్ఘకాలం జీవించి ఉన్న రెండవ వ్యక్తిగా జెస్సీ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. స్నేహితులు, కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతూ, ఎక్కువగా వ్యాయామం చేసే వాళ్లు సుదీర్ఘకాలం బతుకుతారని వందేళ్లు పూర్తయిన వారిపై బ్రిటన్‌లో ఇటీవల నిర్వహించిన జాతీయ సర్వేలో వెల్లడైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+