శిశువు ఏడుపే! తల్లి ప్రాణాలు కాపాడింది(వీడియో)
ఉత్తరకరోలినా: ఓ తల్లి ప్రాణాలను ఆమె కన్న బిడ్డ ఏడుపు కాపాడింది. ఈ అద్భుతమైన ఘటన అమెరికాలోని ఉత్తరకరోలినాలో చోటు చేసుకుంది. ఉత్తరకరోలినాలోని ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. బిడ్డను ప్రసవించి కోమాలోకి వెళ్లిపోయింది కన్నతల్లి షెల్లీ కేవ్లీ. అప్పట్నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది.
వైద్యులు శతవిధాల ప్రయత్నించి ఆమె ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఆ ప్రయత్నాలున్నీ బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. ఆమె బీపీ 60/40కి పడిపోయింది. హృదయ స్పందన సాధారణ స్థాయి కంటే కూడా విపరీతంగా కొట్టుకుంటోంది. చివరికి ఆమె పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్సులా తయారైంది.

వెంటిలెటర్‌పై ఉన్న ఆమెను కాపాడటం ఇక తమ వల్ల కాదని వైద్యులు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. అయితే, కోమాలో ఉన్న ఆమెకు సపర్యలు చేస్తున్న ఆస్పత్రి సిబ్బందికి ఓ ఆలోచన వచ్చింది. అంతే అప్పుడే పుట్టిన శిశువుకు తల్లికి అనుబంధం ఉంటుందని, కోమాలో తల్లి వద్ద శిశువును ఉంచుదామని ఆమె భర్తకు సూచించారు.
ఇక అనుకున్నదే తడవుగా దానిని ఆచరణలో పెట్టారు. ఆ శిశువును తల్లి వద్ద ఉంచి బుగ్గ మీద వేలుతో తట్టాడు భర్త. ఆ బిడ్డ ఏడవటం.. ఆ ఏడుపు విని ఆ తల్లి స్పందించడం చకచక జరిగిపోయాయి. తన భార్య ప్రాణాలు దక్కడంతో ఆమె భర్త ఆమెను ముద్దులు పెట్టుకుంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
వెంటనే, వైద్యులు ఆ శిశువును తల్లి వద్దే ఉంచి వైద్యం చేయడం ప్రారంభించారు. దీంతో తల్లి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటమే కాకుండా... ఆరోగ్యవంతురాలైంది. నిరుడు సెప్టెంబర్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఇటీవలే విడుదల చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications