పెళ్లి వేదికపై వరుడు, వధువు: మధ్యలో ప్రేయసి వచ్చి..(వీడియో)
మరో యువతితో పెళ్లి చేసుకుంటున్న ప్రియుడి వద్దకు పెళ్లి కూతురు వస్త్రాధారణలో ప్రియురాలు.
ఘనా: ఓ యువతిని ప్రేమించిన యువకుడు ఆమెను మోసం చేసి వేరే అమ్మాయితో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన అతడ్ని ప్రేమించిన యువతి అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. వెంటనే అతని పెళ్లి వేడుక వద్దకు పెళ్లి కూతురిలా తయారై వెళ్లింది. దీంతో ఆ యువకుడు షాక్‌కు గురయ్యాడు.
కాగా, పెళ్లి వేదిక వద్ద ఇద్దరు పెళ్లి కూతుళ్లు ఉండటంతో పెళ్లికొచ్చినవారంతా ఇద్దరిలో ఎవరు పెళ్లికూతురో తెలీక సందిగ్ధంలో పడిపోయారు. ఈ ఘటన ఆప్ఱికా ఖండంలోని ఘనా దేశంలో చోటు చేసుకుంది.
అయితే, పెళ్లికొడుకు మాత్రం ఎక్కడ తన ప్రేమాయణం తెలిసిపోతుందోనని ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఆమెను అక్కడ్నుంచి పంపించే ప్రయత్నం చేశాడు. ఆమెను పట్టుకుని బయటికి పంపించినా.. ఆ యువతి మాత్రం అక్కడినుంచి వెళ్లిపోడానికి ఒప్పుకోలేదు.
అంతేగాక, పెళ్లి వేదిక పైకి వెళ్లి మైక్‌లో ఆ అబ్బాయి తనని ప్రేమించి మోసంచేశాడని, అతనో ఉమనైజర్ అంటూ గట్టిగా అరిచి తన బాధను వెల్లగక్కింది. అయితే, చివరికి అతని పెళ్లి ఎవరితో జరిగిందో, లేదా పెళ్లి ఆగిపోయిందో తెలియరాలేదు. కాగా, పెళ్లి వేడుకకు హాజరైన వాళ్లలో కొందరు ఈ తతంగాన్ని వీడియో తీసి నెట్‌లో పెట్టడంతో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications