కానిస్టేబుల్ రేసులో పీహెచ్‌డీ అభ్యర్ధులు

హైదరాబాద్: నిరుద్యోగులను ఆదుకునే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ శాఖలోని ఆయా విభాగాల్లో 9281 కానిస్టేబుల్ భర్తీకి చేపట్టిన నియామక ప్రక్రియలో ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియనుంది. జనవరి 11న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియకు నిరుద్యోగ యువత నుంచి భారీ స్పందన వచ్చింది.

మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు 4.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బుధ, గురు వారాల్లో వచ్చే దరఖాస్తులతో కలిపి ఈ సంఖ్య 4.50 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై నియామక బోర్డు అధికారులు దృష్టి సారించారు.

PhD, MPhil scholars apply for constable jobs in Telangana

ఏప్రిల్‌ 3న మధ్యాహ్నం 2.30 నుంచి సాయం

త్రం 5.30 గంటల వరకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో ఫోటో, సంతకంలో మార్పులు చేసుకునే వారు ప్రిలిమినరీ పరీక్షకు తమ వెంట తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుని తీసుకు రావాలని అధికారులు సూచించారు.

ప్రిలిమినరీలో అర్హత సాధించిన వారికి ఆ తర్వాత మూడు దశల్లో జరిగే శరీర ధారుడ్య, రాత పరీక్ష ద్వారా శిక్షణకు ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టులకు డిమాండ్ పెరిగింది. పీహెచ్‌డీ, ఎంబీఏ, ఎంటెక్‌ వంటి ఉన్నత విద్యలు అభ్యసించిన వాళ్లు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం విశేషం.

విద్యార్హత దరఖాస్తులు
టెన్త్‌ 19,542
ఇంటర్‌ 1,78,917
బీఏ 21,786
బీకాం 31,943
బీ-ఫార్మసీ 1793
బీఎస్సీ 28,810
బీఎస్సీఅగ్రికల్చర్‌ 28
బీటెక్‌ 19,621
బీబీఎం 198
బీసీఏ 125
ఎంఏ 2531
ఎంకామ్‌ 1454
ఎం-ఫార్మసీ 366
ఎంఫిల్‌ 11
ఎమ్మెస్సీ 3597
ఎంటెక్‌ 1002
ఎంబీఏ 7508
ఎంసీఏ 1408
పీహెచ్‌డీ 5
ఇతరత్రా 7428
మొత్తం 3,28,073
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+