పునరుద్ధరణ: నగ్న ఫోటోలు లేని ప్లేబాయ్ మ్యాగజైన్
న్యూయార్క్: మారుతున్న పాఠకులు అభిరుచులకు భిన్నంగా ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ప్లేబాయ్ మ్యాగజైన్ సంస్థాగతంగా కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో ముఖ్యమైంది న్యూడ్ ఫోటోలు లేకుండా నూతన సంచికను మార్కెట్లోకి విడుదల చేయనుంది.
నగ్న చిత్రాలతో పాటు కార్టూన్లు, పార్టీ జోక్‌లను కూడా ఈ సంచికలో ప్లేబాయ్ దూరంగా పెట్టింది. ఫిబ్రవరి 12న అమెరికా మార్కెట్లోకి రానున్న ఈ సంచికలో పేపర్ నాణ్యతను కూడా పెంచినట్లు ప్లేబాయ్ మ్యాగజైన్ యాజమాన్యం పేర్కొంది. ఈ కొత్త సంచికలో నగ్న ఫోటోల మినహా మిగతా పత్రిక మొత్తం యథావిధిగా ఉంటుందని ఆ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
నగ్న ఫోటోలు లేని తొలి మ్యాగజైన్ కవర్ పేజీపై సోషల్ మీడియా స్టార్‌గా వెలుగొందుతున్న సారాహ్ మెక్ డానియల్ మెరిసిపోయింది. మరోవైపు పునరుద్ధరించబడిన ప్లేబాయ్ మ్యాగజైన్‌లో ప్రముఖ రచయిత్రి ఎర్నెస్ట్ హమింగ్‌వే ముద్దుల మనవరాలైన డ్రీ హెమింగ్‌వే అర్ధ నగ్న ప్రదర్శన చేసిన ఫోటోలను ముద్రించారు.

28 ఏళ్ల డ్రీ హెమింగ్‌వే నటిగా, ఫ్యాషన్ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. 62 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్లేబాయ్ మ్యాగజైన్ నగ్న ఫోటోలు లేని సంచికను విడుదల చేయాలని నిర్ణయం తీసుకోగానే ఆ పత్రిక పాఠకులు వందల సంఖ్యలో తమ సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నారు. అయితే నగ్న ఫోటోలు లేకున్నా మరో తరహా స్కిన్ షో ఉంటుందని ఎడిటర్లు పేర్కొన్నారు.
ఈ కొత్త సంచిక ద్వారా అడ్వటైజర్లను ఆకట్టుకోవచ్చన్న అభిప్రాయాన్ని ఆ పత్రిక ఎడిటర్లు వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఇంటర్నెట్‌లో అశ్లీలం ఎక్కువైన నేపథ్యంలో, ప్లేబాయ్ పత్రిక తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. కానీ కొత్త సంచికతో పత్రికకు మంచి గుర్తింపు వస్తుందని ఎడిటర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
1953లో హగ్ హెఫ్నర్ ప్లేబాయ్ సంచికను ప్రారంభించారు. ఇంటర్నెట్‌లో ఉచితంగా ఫోర్న్‌గ్రఫీ లభిస్తున్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 1975లో ప్లేబాయ్ సంచిక పాఠకులు 5.6 మిలియన్లు ఉండగా, ఇటీవల మధ్య కాలంలో ఆ సంఖ్య 800,000లకు పడిపోయింది.
2016 జనవరి/ఫిబ్రవరి ఎడిషన్‌కు గాను చివరిసారిగా నగ్న ఫోటోలకు ఫోజులిచ్చిన నటి మాజీ 'బేవాచ్' స్టార్ పమేలా ఆండర్సన్ నిలిచారు. ప్లేబాయ్ సంచిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ ఫ్లాండర్స్ కొత్త సంచిక 'కార్మికుల లవ్' గా ఉంటుందని స్పష్టం చేశారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications