హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం సెక్యూరిటీ ఆఫీసులో కుక్కల హల్‌చల్

బేగంపేటలోని తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన వీధి కుక్కలు హల్‌చల్ చేస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో కుక్కల బెడద ఎంత ఉందో ఇక్కడ నివసిస్తున్న ప్రతీ సామాన్యుడికి తెలుసు. గతంలో పలుమార్లు పిల్లలు, పెద్దలపై దాడి చేసిన కుక్కలు.. వారిని ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేశాయి. బాధితుల ఫిర్యాదుతో తాత్కాలిక చర్యలు తీసుకున్నా.. శాశ్వత పరిష్కారం మాత్రం లభించలేదు.

సామాన్యుల బాధలు ఇలావుంటే ఏకంగా బేగంపేటలోని తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన వీధి కుక్కలు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఇంటికి పక్కనే ఉన్న మంజీరా గెస్ట్ హౌజ్ గేటు దూకి సీఎం సెక్యూరిటీ క్వార్టర్స్‌లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో అక్కడివారు కూడా భయాందోళనకు గురవుతున్నారు.

Strays enter K Chandrashekar Rao’s security office

కుక్కల బెడదతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఐదు డాగ్ స్క్వాడ్స్, ఓ క్యాచింగ్ యూనిట్‌తో ఆ కుక్కలను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. బుధవారం వరకు కూడా ఆ కుక్కల జాడ తెలియలేదని, వాటి కోసం గాలిస్తున్నట్లు జీహెచ్ఎంసీ బేగంపేట వెటర్నరీ ఆఫీసర్ తెలిపారు.

పాత సెక్యూరిటీ ఫోర్సెస్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న గత సీఎం క్యాంప్ ఆఫీసులోనే 9ఎకరాల్లో సువిశాలమైన భవనాన్ని నిర్మించగా.. ముఖ్యమంత్రి ఇటీవల గృహ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.

కాగా, ప్రధానంగా మంజీరా గెస్ట్ హౌజ్ గేట్ నుంచే ఈ వీధి కుక్కలు సెక్యూరిటీ క్వార్టర్స్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఐఏఎస్ రిక్రియేషన్ సెంటర్ శిథిలాలు, అక్కడి చెత్తాచెదారం కుప్పలుగా ఉండటంతో వీధి కుక్కలు అక్కడే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అటు జీహెచ్ఎంసీ, ఇటు సెక్యూరిటీ సిబ్బంది ఆ కుక్కల స్వైరవిహారానికి చెక్ పెట్టే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.

English summary
The menace of stray dogs has not spared the Chief Minister's security quarters at Begumpet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X