అశ్లీల ఫోటోలో తమిళనాడు మంత్రి: తొలగింపు
చెన్నై: తమిళనాడు పశుసంవర్థకశాఖ మంత్రి బీవీ రమణను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాలు జారీ చేశారు. ఓ మహిళ రమణను ముద్దాడుతున్న అశ్లీలఫోటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో విడుదల కావడంతో.. ఆగ్రహించిన జయ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, బీవీ రమణ తొలగింపు కారణంగా గ్రామీణ పరిశ్రమల శాఖా మంత్రి పి మోహన్ పశుసంవర్థక శాఖ బాధ్యతలనూ చేపట్టారు. ఈ మేరకు సీఎం జయలలిత పంపిన సిఫార్సులకు గవర్నర్ రోశయ్య ఆమోదం తెలిపారు.

గత కొన్ని రోజుల క్రితం రమణ, ఓ మహిళతో ముద్దు పెట్టుకున్నట్లు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాగా, ఆమె తన భార్య అని మంత్రి సహాయకుడు ఒకరు వాపోయారు. ఈ నేపథ్యంలోనే రమణను మంత్రి పదవి నుంచి తొలగించడం జరిగింది.
గతంలో కూడా ఒకసారి రమణను మంత్రి పదవి నుంచి తొలగించిన జయలలిత.. మరో సారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఆయనను మంత్రి పదవి నుంచి, ఏఐఏడిఎంకె జిల్లా కార్యదర్శి పదవి నుంచి తొలగించారు.












Click it and Unblock the Notifications