నేనో సెక్స్ వర్కర్‌ని, ఇది నా ఇష్టం: భర్త స్వేచ్ఛ ఇచ్చాడని ఓ మహిళ
బెంగళూరు: 30 ఏళ్ల వయస్సులో, తన భర్త చనిపోతే, ఇద్దరు పిల్లలను పోషించుకునేందుకు తాను బలవంతంగా సెక్స్ వర్కర్‌గా మారవలసి వచ్చిందని చెబుతోంది ఓ మహిళ. తన పెళ్లైన కొద్ది రోజులకే భర్త చనిపోయాడని, పిల్లల కోసం తప్పనిసరిగా సెక్స్ వర్కర్‌గా మారానని, ఎవరి బలవంతం లేదని చెబుతోంది సదరు మహిళ.
సాటి మనిషికి పట్టించుకునే తీరిక లేనప్పుడు, జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు... కొందరు వాటితో పోరాడుతారు. మరికొందరు మౌనంగా ఉంటారు. కొందరు మానం లేదా గౌరవం గురించి ఆలోచించకుండా కూడా సమస్యలతో పోరాడే వారు ఉన్నారు.
వారి ఆత్మాభిమానాన్ని వారిని అడ్డుకునేలా ఉండవు. ఎందుకంటే ఆ సమయంలో వారికి అమాంతం తొక్కేస్తున్న సమస్య భూతాన్ని చంపడమే లక్ష్యంగా ఉంటుంది. బెంగళూరుకు చెందిన ఈ మహిళ కూడా అలాగే, సమస్యలతో పోరాడేందుకు గౌరవం, ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టారు.
ఆమెకు చిన్న వయస్సులో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కలగగానే భర్త చనిపోయాడు. పరిస్థితులు ఆమెను వ్యభిచార రొంపిలోకి దింపాయి. అక్కడ అనుభవిస్తున్న బాధ నుంచి ఎలాగైన విముక్తి పొందాలని ఎదురు చూసింది. పోలీసుల రూపంలో సహాయం దొరకడంతో ఆ కూపం నుంచి తప్పించుకుంది.

దాదాపు పదేళ్ల పాటు అందులో నరకం అనుభవించి తిరిగి స్వేచ్ఛను పొందింది. ఇప్పుడు ఆమె ఓ వ్యక్తి తన పిల్లలకు రక్షణగా, తనకు తోడుగా ఉండేందుకు పెళ్లి చేసుకుంది. అతడు ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. ఆమె తన వృత్తిని మాత్రం ఆ తర్వాత కూడా వదులుకోలేదు.
ఆమె ఆ వృత్తిని కొనసాగించేందుకు భర్త అంగీకరించాడు. దీంతో ఆమె కొనసాగిస్తోంది. అయితే, ఈసారి ఆమె వేశ్యా గృహానికి వెళ్లి కాకుండా, బలవంతంగా కాకుండా.. తన ఇష్ట ప్రకారం పని చేస్తోంది. ఇప్పుడు నచ్చిన వారితోనే పని చేస్తోంది. నేనో సెక్స్ వర్కర్‌ని అని, కానీ తాను ఇప్పుడు బలవంతంగా పని చేయడం లేదని, నా ఛాయిస్ ప్రకారమే పని చేస్తున్నానని చెప్పింది.












Click it and Unblock the Notifications