గౌతమి పుత్ర శాతకర్ణిలో టిడిపి మహిళా నేత: ఎవరామె?
టిడిపి మహిళా నేతకు ఒకరికి బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణిలో నటించే అవకాశం లభించింది. రాజకీయాల్లో తల పండిన ఆమె సినిమాలో తన జాతకాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎవరామె...
టిడిపి మహిళా నేతకు ఒకరికి బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణిలో నటించే అవకాశం లభించింది. రాజకీయాల్లో తల పండిన ఆమె సినిమాలో తన జాతకాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎవరామె...
అనంతపురం: బాలయ్య నటించిన ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణిలో తెలుగుదేశం పార్టీ మహిళా నేతకు ఒకరికి నటించే అవకాశం లభించింది. అనంతపురం జిల్లాకు చెందిన ఆ మహిళా ఎమ్మెల్సీ ఎవరో కాదు, రాజకీయాల్లో తల నెరిసిన శమంతకమణి. ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది.

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా జనవరి 12న విడుదల కానుంది. అనంతపురం జిల్లాలో రాజకీయ నాయకురాలుగా కొనసాగుతూ, సినిమాలో నటించిన తొలి మహిళగా శమంతకమణి గుర్తింపు దక్కించుకున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో ఓ మార్కెట్‌లో వ్యాపారురాలి పాత్రను శమంతకమణి పోషించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ, శ్రేయ భార్యాభర్తలుగా ఇందులో నటిస్తున్న విషయం తెలిసిందే.
వీరిద్దరూ కలిసి మారువేషాల్లో మార్కెట్‌కు వెళ్లిన సమయంలో బాలకృష్ణ జేబులో నుంచి ఓ నాణెం కింద పడిపోతుంది. శ్రేయ ఆ నాణెంపై తన కాలు పెట్టే సమయంలో శమంతకమణి చూసి తన చేయి పెట్టి అడ్డుకుంటారు. 'కాలు తీయ్.. మా దేవుడినే తొక్కుతావా' అంటూ శ్రేయను శమంతకమణి ప్రశ్నిస్తారు.
ఇలా రెండు నిమిషాల సన్నివేశంలో ఆమె నటించినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదల సందర్భంగా శమంతకమణి అధికారికంగా తెలిపారు కూడా. అయితే, ఆ విషయంపై మాట్లాడేందుకు శమంతకమణి నిరాకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications