చైనా దొరికిపోయింది?: ఇదిగో కుటిల నీతి.. మూడు అస్త్రాలతో భారత్‌ను దెబ్బ కొట్టాలని!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: యుద్దం విషయంలో అగ్ర రాజ్యం అమెరికా అవలంభిస్తున్న ద్వంద్వ నీతినే చైనా కూడా అవలంభిస్తోంది. ఓవైపు యుద్దం వద్దంటూనే ఆయుధ అమ్మకాలను పెంచుకోవడం.. ఉత్తరకొరియాను హెచ్చరిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు దోహదపడటం అమెరికా ద్వంద్వ నీతిని బయటపెట్టాయి.

డోక్లామ్‌లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినా

ఇప్పుడు చైనా విషయంలోను ఇదే ద్వంద్వ నీతి తేట తెల్లమైంది. భారత్ తో యుద్దానికి కాలు దువ్వినట్లుగా వ్యవహరిస్తున్న చైనా.. అమెరికా-ఉత్తరకొరియాలకు మాత్రం శాంతి హితం బోధిస్తోంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం.

అమెరికా ద్వంద్వ నీతి?: యుద్దం బూచితో ఆ దేశం ఏం చేస్తుందో తెలుసా?

ఎవరూ తగ్గడం లేదు:

ఎవరూ తగ్గడం లేదు:

అటు అమెరికా, ఇటు ఉత్తరకొరియా.. రెండు దేశాలు ఢీ అంటే ఢీ అన్న తరహాలోనే వ్యవహరిస్తుండటంతో.. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న ఆందోళన ప్రస్తుతం ప్రపంచాన్ని వెంటాడుతోంది.

అమెరికా భూభాగాన్ని ధ్వంసం చేసేలా ఖండాంతర క్షిపణులను సిద్దం చేసుకున్నామని ఉత్తరకొరియా హెచ్చరిస్తుంటే.. 'ఫుల్లీ లోడెడ్' క్షిపణులతో తాము కూడా సిద్దంగా ఉన్నామని ఇటు ట్రంప్ ధీటుగా బదులిచ్చారు. అమెరికా నిపుణులు, బయటిదేశాలు ఆ దేశాన్ని సంయమనం పాటించాల్సిందిగా కోరుతున్నా.. ఉత్తరకొరియా ఎక్కడ తమ కొంప ముంచుతోందనన్న భయం అమెరికాను వెంటాడుతోంది.

North Korea vs US : Donald Trump issued an Ultimatum To Kim Jong-un
సంయమనం పాటించమన్న జిన్ పింగ్:

సంయమనం పాటించమన్న జిన్ పింగ్:

భారత్ విషయంలో 'ఇక మా ఓపిక నశించింది' అంటూ వ్యాఖ్యలు చేసిన చైనా.. అమెరికా-ఉత్తరకొరియాలను మాత్రం సంయమనం పాటించాలని కోరడం విడ్డూరం. పరిస్థితులు మరింత చేజారకముందే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సూచించారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలనేదే తమ అభిమతమని పేర్కొన్నారు.

మూడు అస్త్రాలతో సిద్దం:

మూడు అస్త్రాలతో సిద్దం:

అమెరికా-ఉ.కొరియా సంగతి పక్కనపెడితే భారత్ విషయంలో మాత్రం చైనా లోపాయికారీ వైఖరినే అవలంభిస్తోంది. పైకి మాత్రం సమస్య సద్దుమణిగేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతూనే.. అంతర్గతంగా భారత్ ను ఇరుకుపెట్టేందుకు కావాల్సిన అస్త్రాలను సిద్దం చేసుకుంటోంది.

ఇందులో భాగంగా మీడియా దాడి, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ప్రభావితం చేయడం, మానసికంగా దెబ్బ తీయడం వంటి మూడు ప్రధానాంశాలపై చైనా ఫోకస్ పెట్టింది. ఈ మేరకు భారత్ ను ఇరుకునపెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది.

తొలి నుంచి మీడియాతోనే:

తొలి నుంచి మీడియాతోనే:

భారత్-చైనా మధ్య సాగుతున్న డోక్లామ్ వివాదంలో చైనా మీడియా పాత్ర కీలకమైనది. కవ్వింపు చర్యలతో తొలి నుంచి చైనా మీడియా భారత్‌ను టార్గెట్ చేస్తూనే ఉంది. భారత్‌కు ప్రతికూలంగా ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధులు, ఇతరులు చేసిన వ్యాఖ్యలను అంతర్జాతీయంగా చైనా మీడియా హైలైట్ చేస్తోంది. దీనికి చైనా ప్రజల మద్దతు కూడా ఉందనేలా కథనాలు ప్రచురిస్తోంది.

మానసికంగాను దెబ్బకొట్టేలా?:

మానసికంగాను దెబ్బకొట్టేలా?:

చైనా మీడియా ప్రచురిస్తున్న కథనాలు.. యుద్దం దిశగా సాగుతుండటంతో.. భారత్ శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం చైనా అధ్యక్షుడితో భేటీ అయి చర్చించారు. ఇటు భారత్ సైతం తాము యుద్దాన్ని కోరుకోవడం లేదన్న సంకేతాలనే పంపిస్తోంది. ఒకవిధంగా భారత్ ను అణిగిమణిగి ఉంచేలా చైనా ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతోందన్న అభిప్రాయాలున్నాయి.

అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ప్రభావితం చేసేలా:

అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ప్రభావితం చేసేలా:

ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారితే ఈ వివాదం అంతర్జాతీయ పరిధిలోకి వెళ్లనుంది. అలాంటి సమయంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ప్రభావితం చేసేందుకు కూడా వెనుకాడని రీతిలో చైనా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వచ్చినా.. దాన్ని ధిక్కరించేందుకు వెనుకాడవద్దని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైతే చైనా కుటిల యుక్తులు భారత్ సమర్థవంతంగానే ఎదుర్కొంటోంది. మున్ముందు ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయోనన్నదే ఆందోళన.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Is China playing out its 'Three Warfares' strategy against India? Indian strategists who are involved with China in the current Doklam crisis believe China has now fully operationalized this concept and is applying it to the Doklam crisis.
Please Wait while comments are loading...