షాకింగ్: రెండు నాలుకల సుందరి! సోషల్ మీడియాలో వైరల్ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: సాధారణంగా ఎవరికైనా ఒకటే నాలుక ఉంటుంది. ఎవరైనా ముందొకమాట, తరువాత ఒక మాట చెబితే.. అలాంటి వారిని.. 'నీది రెండు నాల్కల ధోరణి రా..' అనడం కద్దు.

సాధారణంగా రాజకీయ విమర్శల్లో ఈ 'రెండు నాల్కల ధోరణి..' అనే మాట వినిపిస్తూ ఉంటుంది. రాజకీయ నాయకులు తమ ప్రత్యర్తులపై విమర్శలు చేసేటప్పుడు ఈ మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.

నిజ జీవితంలో పాములకు నాలుక రెండుగా చీలి ఉండటం మనందరికీ తెలిసిందే. కానీ మనుషులకే రెండు నాలుకలు ఉంటే? ఛ... ఊరుకోండి.. ఇదేమైనా హర్రర్ సినిమానా? అంటారా?

లేదండీ బాబూ.. ఈ రెండు నాలుకల సుందరిని చూస్తే మీరు షాక్ తింటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. అందులో ఓ అందమైన అమ్మాయి రెండు నాలుకలతో కనిపించడమేకాక.. ఆ నాలుకలతో లయబద్ధంగా నాట్యం కూడా చేయించింది.

ఒక్క ఈ అమ్మాయే కాదు.. యూట్యూబ్ లోకి వెళ్లి 'స్ప్లిట్ టంగ్ గర్ల్' అని ఇంగ్లీషులో కొట్టి చూడండి.. మీకే తెలుస్తుంది ఎన్ని వీడియోలు వస్తాయో? అయితే అవి రెండు నాలుకలు కావని, ఉన్న నాలుకనే ముందు భాగంలో మధ్యకి కోసి వారు అలా రెండు నాలుకలుగా మార్చుకున్నారనేది నెటిజన్ల కామెంట్. మరి మీరేమంటారో చూసి చెప్పండి!

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This woman has a very unique party trick - she can perform tricks with her tongue. She has managed to split her tongue by cutting the natural central divide in the fleshy muscle - otherwise known as the median fibrous septum. Take a look.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి