వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజమా: ఎన్నికలొస్తే కెెసిఆర్‌కు షాక్, ఎవరికెన్ని సీట్లు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎన్నికలొస్తే కెసిఆర్‌కు షాక్, సంకీర్ణం తప్పదంటూ ఆ సర్వే !

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు షాక్ తప్పదట. సోమవారంనాడు ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఓ సర్వే చేశారట. ఆ సర్వే ఎవరు చేశారు, ఎంత మందిని సర్వే చేశారు, శాంపిల్ సిస్టమ్ ఏణిటి, పొత్తులను పరిగణనలోకి తీసుకున్నారా అనే విషయాలు మాత్రం తెలియవు. కానీ తెలంగాణలో సంకీర్ణం తప్పదంటూ ఆ సర్వే తేల్చిచెబుతున్నట్లు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

కెసిఆర్ చెప్పేది ఇదీ...

కెసిఆర్ చెప్పేది ఇదీ...

ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు 110 దాకా సీట్లు వస్తాయని కెసిఆర్ పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 119. అంటే ఆయన చెప్పేదాన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది. మగిలిన సీట్లలో మజ్లీస్ ఆరు, మిగతావాళ్లకు మూడు వస్తాయని కెసిఆర్ చెబుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఇలా...

ఆదిలాబాద్ జిల్లాలో ఇలా...

జిల్లాలవారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని మాత్రమే కాకుండా ఏ సీటు ఏ పార్టీకి వస్తాయో కూడా వాట్సప్‌లో సందడి చేస్తున్న సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఆదిలాబాదులోని పది సీట్లలో తెరాసకు 6, కాంగ్రెసుకు 4 వస్తాయట.

సిర్పూర్ - తెరాస,
చెన్నూరు - తెరాస
బెల్లంపల్లి - కాంగ్రెసు
మంచిర్యాల - తెరాస
ఆసిఫాబాద్ - కాంగ్రెసు
ఖానాపూర్ -తెరాస
ఆదిలాబాద్ - కాంగ్రెసు
బోథ్ - కాంగ్రెసు
నిర్మల్ - తెరాస
ముథోల్ - తెరాస

కరీంనగర్ జిల్లాలో ఇలా...

కరీంనగర్ జిల్లాలో ఇలా...

కరీంనగర్ జిల్లాలో తెరాసకు 6, కాంగ్రెసుకు 5, బిజెపికి 2 సీట్లు వస్తాయట. ఆ ఫలితాలు ఇలా ఉంటాయట.

కోరుట్ల- తెరాస
జగిత్యాల - కాంగ్రెసు
ధర్మపురి - తెరాస
రామగుండం - కాంగ్రెసు
మంథని - కాంగ్రెసు
పెద్దపల్లి - తెరాస
కరీంనగర్ - బిజెపి
చొప్పదండి - తెరాస
వేములవాడ - బిజెపి
సిరిసిల్ల - తెరాస
మానకొండూరు - కాంగ్రెసు
హుజూరాబాద్ - తెరస
హుస్నాబాద్ - కాంగ్రెసు

నిజామాబాద్ జిల్లాలో ఇలా...

నిజామాబాద్ జిల్లాలో ఇలా...

నిజామాబాద్ జిల్లాలో తెరాసకు 5, కాంగ్రెసుకు 3, బిజెపికి 1 సీట్లు వస్తాయట. ఆ ఫలితాలు ఇలా ఉంటాయని చెబుతున్నారు.

ఆర్మూర్ - కాంగ్రెసు
బోధన్ - తెరాస
జుక్కల్ - తెరాస
బాన్స్‌వాడ - తెరాస
ఎల్లారెడ్డి - తెరాస
కామారెడ్డి - కాంగ్రెసు
నిజామాబాద్ (అర్బన్) - బిజెపి
నిజామాబాద్ (రూరల్) - తెరాస
బాల్కొండ - కాంగ్రెసు

వరంగల్ జిల్లాలో ఇలా...

వరంగల్ జిల్లాలో ఇలా...

వరంగల్ జిల్లాలో కాంగ్రెసు, తెరాసలకు చెరి సగం అంటే ఆరేసి సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఆ ఫలితాలు ఇలా ఉంటాయని చెబుతున్నారు.

జనగాం - కాంగ్రెసు
స్టేషన్ ఘనపూర్ - తెరాస
పాలకుర్తి - కాంగ్రెసు
డోర్నకల్ - తెరాస
మహబూబాబాద్ - కాంగ్రెసు
నర్సంపేట - కాంగ్రెసు
పర్కాల - తెరాస
వరంగల్ (వెస్ట్) - తెరాస
వరంగల్ (ఈస్ట్) - తెరాస
వర్ధన్నపేట -తెరాస
భూపాలపల్లి - కాంగ్రెసు
ములుగు - కాంగ్రెసు

మెదక్ జిల్లాలో ఇలా...

మెదక్ జిల్లాలో ఇలా...

మెదక్ జిల్లాలో తెరాసకు 6, కాంగ్రెసుకు 4 సీట్లు వస్తాయట. ఆ ఫలితాలు ఇలా ఉన్నాయంటూ సర్వే పేరుతో చేసిన పోస్టులో చెప్పారు.

సిద్ధిపేట- తెరాస
మెదక్ - తెరాస
నారాయణఖేడ్ - తెరాస
ఆందోల్ - కాంగ్రెసు
నర్సాపూర్ - కాంగ్రెసు
జహీరాబాద్ - కాంగ్రెసు
సంగారెడ్డి - కాంగ్రెసు
పటాన్‌చెరు - తెరాస
దుబ్బాక - తెరాస
గజ్వెల్ - తెరాస

హైదరాబాదు జిల్లాలో ఇలా...

హైదరాబాదు జిల్లాలో ఇలా...

హైదరాబాదులో మజ్లీస్‌కు 7, బిజెపికి 3, తెరాసకు 2, కాంగ్రెసుకు 2, టిడిపికి 1 సీట్లు వస్తాయని చెబుతున్నారు. కెసిఆర్ మజ్లీస్‌కు ఆరు సీట్లు ఇస్తే ఈ సర్వేలో ఏడు సీట్లు ఇచ్చారు.

ముషీరాబాద్ - బిజెపి
మలకపేట - మజ్లీస్
అంబర్‌పేట - బిజెపి
ఖైరతాబాద్ - తెరాస
జూబ్లీహిల్స్ - టిడిపి
సనత్నగర్ - కాంగ్రెసు
నాంపల్లి - మజ్లీస్
కార్వాన్ - మజ్లీస్
గోషామహల్ - బిజెపి
చార్మినార్ - మజ్లీస్
చాంద్రాయణగుట్ట - మజ్లీస్
యాకూత్‌పురా - మజ్లీస్
బహదూర్‌పురా - మజ్లీస్
సికింద్రాబాద్ - తెరాస
సికింద్రాబాద్ కంటోన్మెంట్ - కాంగ్రెసు

రంగారెడ్డి జిల్లాలో ఇలా...

రంగారెడ్డి జిల్లాలో ఇలా...

రంగారెడ్డి జిల్లాలో తెరాసకు 5, బిజెపికి 2, టిడిపికి 1, కాంగ్రెసుకు 6 సీట్లు వస్తాయని అంచనా వేశారు.

మేడ్చెల్ - కాంగ్రెసు
మల్కాజిగిరి - బిజెపి
కుత్బుల్లాపూర్ - తెరాస
కూకట్‌పల్లి - బిజెపి
ఉప్పల్ - తెరాస
ఇబ్రహీంపట్నం - తెరాస
ఎల్బీ నగర్ - తెరాస
మహేశ్వరం - కాంగ్రెసు
రాజేంద్రనగర్ - కాంగ్రెసు
శేర్‌లింగంపల్లి - టిడిపి
చేవెళ్ల - కాంగ్రెసు
పరిగి - కాంగ్రెసు
వికారాబాద్ - కాంగ్రెసు
తాండూరు - తెరాస

మహబూబ్‌నగర్ జిల్లాలో ఇలా...

మహబూబ్‌నగర్ జిల్లాలో ఇలా...

మహబూబ్‌నగర్ జిల్లాలో తెరాస దాదాపుగా తుడిచిపెట్టుకుని పోతుందని అంచనా వేశారు. తెరాసకు ఒక్కటంటే ఒక్కటే సీటు వస్తుందట. కాంగ్రెసుకు 13 సీట్లు వస్తాయట.

కొడంగల్ - కాంగ్రెసు
నారాయణపేట - కాంగ్రెసు
మహబూబ్‌నగర్ - కాంగ్రెసు
జడ్చర్ల - కాంగ్రెసు
దేవరకొండ - కాంగ్రెసు
మక్తల్ - కాంగ్రెసు
వనపర్తి - కాంగ్రెసు
గద్వాల - కాంగ్రెసు
ఆలంపూర్ - కాంగ్రెసు
నాగర్‌కర్నూలు - తెరాస
అచ్చంపేట - కాంగ్రెసు
కల్వకుర్తి - కాంగ్రెసు
షాద్‌నగర్ - కాంగ్రెసు
కొల్లాపూర్ - కాంగ్రెసు

నల్లగొండ జిల్లాలో ఇలా...

నల్లగొండ జిల్లాలో ఇలా...

నల్లగొండ జిల్లాలో కాంగ్రెసుకు 8 సీట్లు, తెరాసకు 4 సీట్లు వస్తాయట. ఏ పార్టీకి ఏ సీటు వస్తుందో ఇలా చెప్పారు.

భువనగిరి - తెరాస
ఆలేరు - తెరాస
మునుగోడు - కాంగ్రెసు
దేవరకొండ - కాంగ్రెసు
నల్లగొండ - కాంగ్రెసు
నక్రేకల్ - తెరస
సూర్యాపేట - కాంగ్రెసు
తుంగతుర్తి - కాంగ్రెసు
మిర్యాలగుడా - తెరాస
నాగార్జునసాగర్ - కాంగ్రెసు
హుజూర్‌నగర్ - కాంగ్రెసు
కోదాడ - కాంగ్రెసు

ఖమ్మం జిల్లాలో ఇలా...

ఖమ్మం జిల్లాలో ఇలా...

ఖమ్మం జిల్లాలో తెరాసకు 5, కాంగ్రెసుకు 4, సిపిఎంకు 1 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఆ సీట్లు ఇలా వస్తాయని అంచనా.

పినపాక - కాంగ్రెసు
ఇల్లందు - కాంగ్రెసు
ఖమ్మం - తెరాస
పాలేరు - తెరాస
మథిర - కాంగ్రెసు
వైరా - తెరాస
సత్తుపల్లి - తెరాస
కొత్తగూడెం - తెరస
అశ్వారావుపేట - కాంగ్రెసు
భద్రాచలం - సిపిఎం

రాష్ట్రవ్యాప్తంగా ఇలా...

రాష్ట్రవ్యాప్తంగా ఇలా...

రాష్ట్రవ్యాప్తంగా తెరాసకు 46 సీట్లు మాత్రమే వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. అంటే గత ఎన్నికల్లో కన్నా 15కు పైగా తక్కువ సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెసుకు మెజార్టీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెసు 56 సీట్లు గెలుస్తుందట. బిజెపి 8 సీట్లు, మజ్లీస్ 7,, టిడిపి 2, సిపిఎం 1 సీటు గెలుస్తాయని చెబుతున్నారు. అంటే, తెలంగాణలో సంకీర్ణం తప్పదని చెబుతున్నారు. అయితే, ఈ సర్వే విశ్వసనీయత ఎంత అనేది లెక్క గట్టలేం. సర్వే ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే తదితర అంశాలేవీ లేవు. దీన్ని నమ్మడానికేమీ లేదు. అందువల్ల దీన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు.

English summary
According to a survey making rounds in Social media says Telangana Rastra Samithi (TRS) will loose the power. This is not having any scientific reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X