రోజా! నీ క్యారెక్టర్ ఏంటి?: టిడిపి ఎమ్మెల్సీ, వస్త్రధారణపై అఖిలప్రియ
వైసిపి నేత, నగరి ఎమ్మెల్యే రోజాపై టిడిపి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దుమ్మెత్తి పోశారు. జబర్దస్త్ లాంటి కార్యక్రమాలకు జడ్జిగా ఉంటూ మహిళలు సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
నంద్యాల: వైసిపి నేత, నగరి ఎమ్మెల్యే రోజాపై టిడిపి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దుమ్మెత్తి పోశారు. జబర్దస్త్ లాంటి కార్యక్రమాలకు జడ్జిగా ఉంటూ మహిళలు సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు.

నీకు దిమ్మ తిరుగుతుంది
రోజా! నీ క్యారెక్టర్ ఏమిటి, నీవు ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడమా అని మండిపడ్డారు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై అవాకులు, చెవాకులు పేలితో జనాల్లో తెరగలేవని హెచ్చరించారు. టిడిపి మహిళల దెబ్బకి నీకు దిమ్మ తిరిగిపోతుందన్నారు.
Recommended Video


రోజా వ్యక్తిగత విమర్శలపై అఖిలప్రియ
తనపై రోజా వ్యక్తిగత విమర్శలు చేస్తే, దానిని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి అఖిలప్రియ వేరుగా అన్నారు. రోజా తన వస్త్రధారణపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. శిల్పాచక్రపాణి రెడ్డి మహిళలపై చేసిన వ్యాఖ్యలకు మహిళలు మండిపడుతున్నారని చెప్పారు.

ఎవర్నీ రెచ్చగొట్టడం లేదు
రోజా చెప్పినట్లుగా తాను ఎవరినీ రెచ్చగొట్టడం లేదని అఖిలప్రియ తేల్చి చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. తాను తండ్రి బాటలో నడుస్తున్నానని చెప్పారు.

జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు
తాను జగన్‌ను ఏదో అన్నట్లు రోజా చెబుతున్నారని, కానీ తాను ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయలేదని అఖిలప్రియ అన్నారు. ఎవరి స్థాయిలో వారు ఉన్నారని చెప్పారు. తన తల్లిదండ్రులు ఎలాంటి గౌరవం ఆయన పట్ల ప్రదర్శించారో, నేను అలాగే ప్రదర్శించానన్నారు. ఆ రోజు తన తండ్రి గురించి జగన్ మాట్లాడుతారనుకున్నానని చెప్పానే తప్ప, ఇంకేమీ అనలేదన్నారు.

రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే వైసిపి
నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే వైసిపి అన్నారు. తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆమె మాట్లాడిందని నేను, నేను మాట్లాడానని రోజా మాట్లాడితే ప్రజా సమస్యలు పక్కకు వెళ్తాయన్నారు. కాబట్టి తాను మాట్లాడనని చెప్పారు. ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నానని తెలిపారు.












Click it and Unblock the Notifications