Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిన్నమ్మ లైఫ్ జర్నీ: సినిమాను మించిన మలుపులతో సీఎం దాకా..

చంద్రశేఖరన్ పిళ్లై కుమారుడు వివేకానందన్ ఇంగ్లిష్ మందుల దుకాణం నిర్వహించేవారు. దీంతో 'ఇంగ్లిష్ మందుల దుకాణం వాళ్లు' అని వీరి కుటుంబానికి పేరు పడిపోయింది.

చెన్నై: రసవత్తరంగా సాగుతోన్న తమిళ రాజకీయాలు ప్రతీ ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రెండు రోజుల హైడ్రామా తర్వాత చివరాఖరికి శశికళకే ప్రభుత్వ పగ్గాలు అప్పజెప్పాలని ఆ పార్టీ తీసుకున్న అనూహ్య నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మొత్తానికి ఈ పరిణామాలన్నింటిని గమనిస్తే.. 'పన్నీర్ సెల్వం' ఇక ఎన్నటికీ సీఎం పదవిలో పూర్తి కాలం కొనసాగలేరన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఓ వీడియో షాపు యజమాని ఏకంగా సీఎం స్థాయికి ఎదగడాన్ని బట్టి చూస్తే.. శశికళ జీవితం అచ్చు సినిమాలను తలపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

ఎక్కడ మొదలైందీ ప్రయాణం:

ఎక్కడ మొదలైందీ ప్రయాణం:

శశికళ తాత చంద్రశేఖరన్ పిళ్లై ఓ నాటు వైద్యుడు. తమిళనాడులోని రామనాథపురంలో నాటు వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. పరిస్థితుల రీత్యా తర్వాతి కాలంలో వారి కుటుంబం తంజావూరు వలస వెళ్లింది.

నాటు వైద్యంతో వచ్చే డబ్బులతోనే కుటుంబ పోషణ కొనసాగేది. కాగా, చంద్రశేఖరన్ పిళ్లై కుమారుడు వివేకానందన్ ఇంగ్లిష్ మందుల దుకాణం నిర్వహించేవారు. దీంతో 'ఇంగ్లిష్ మందుల దుకాణం వాళ్లు' అని వీరి కుటుంబానికి పేరు పడిపోయింది. వివేకానందన్ కృష్ణవేణి దంపతులకు ఐదో సంతానంగా శశికళ జన్మించింది.

కరుణానిధి చేతుల మీదే 'శశికళ'పెళ్లి:

కరుణానిధి చేతుల మీదే 'శశికళ'పెళ్లి:

డీఎంకె అధినేత కరుణానిధి చేతుల మీదుగా 1970లో శశికళ, నటరాజన్ ల వివాహం జరిగింది. 1980లొ నటరాజన్ ప్రభుత్వ పౌర సంబంధాల అధికారిగా పనిచేశారు. అదే సమయంలో 'వినోద వీడియో విజన్' పేరిట అన్నాసలైలోని జెమినీ పార్సన్ కాంప్లెక్స్‌లో శశికళ వీడియో పార్లర్ నిర్వహించేవారు.

జయ-చంద్రలేఖ స్నేహం కీలకంగా:

జయ-చంద్రలేఖ స్నేహం కీలకంగా:

1982లో ఎంజీ రామచంద్రన్ జయలలితను పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించారు. ప్రభుత్వం ఆ సమయంలో బడిపిల్లల పౌష్టికాహార పథకాన్ని ప్రవేశపెట్టడంతో.. దీనికి విస్తృత ప్రచారాన్ని తీసుకొచ్చే పనిలో పడ్డారు జయ.

ఇదే క్రమంలో కడలూరులో నిర్వహించిన ఈ పథకం ప్రచార కార్యక్రమానికి జయలలిత హాజరవడం.. అక్కడే కలెక్టర్ చంద్రలేఖతో పరిచయం ఏర్పడటం జరిగిపోయాయి. అదే సమయంలో నటరాజన్ పౌర సంబంధాల అధికారిగా ఉండటంతో.. ఆయన ఈ పథకాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లారు.

చంద్రలేఖకు శశికళ సహాయకురాలిగా..:

చంద్రలేఖకు శశికళ సహాయకురాలిగా..:

చంద్రలేఖతో ఉన్న స్నేహం కారణంగా జయలలిత ఆమెను సహాయకురాలిగా నియమించుకున్నారు. ఆ సమయంలో జయలలిత రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. ఇక అప్పటినుంచి వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. అది ఎంతదాకా అంటే.. జయ ఎక్కడికెళ్లినా.. చంద్రలేఖ వెంట ఉండాల్సిందే.

చంద్రలేఖకు బిడ్డ పుట్టిన సమయంలో.. చిన్నారి ఆలనా-పాలనా చూడటానికి సహాయకురాలిని నియమించాలనుకున్నారు. శశికళకు కూడా పిల్లలు లేని కారణంగా.. ఆ చిన్నారి ఆలనా-పాలనా చూడటానికి ఆమె అయితేనే కరెక్ట్ అనుకున్న నటరాజన్.. శశికళను సహాయకురాలిగా నియమించారు.

జయతో పరిచయం ఇలా:

జయతో పరిచయం ఇలా:

తన వద్ద సహాయకురాలిగా ఉన్న సమయంలోనే చంద్రలేఖ జయలలితకు శశికళను పరిచయం చేశారు. . దీంతో చంద్రలేఖ లేని సమయాల్లో బోర్ అనిపించిన ప్రతిసారి జయలలిత.. శశికళ నడుపుతున్న వీడియో షాపు నుంచి ఇంగ్లిష్ సినిమాల క్యాసెట్లను తెప్పించుకుని చూసేవారు.

అలా.. జయలలితకు శశికళతో పరిచయం ఏర్పడింది. రాను రాను అది మరింతగా బలపడటంతో.. ఇద్దరి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. ఇక ఆ తర్వాతి కాలంలో 1989 నుంచి శశికళ.. జయలలితోనే ఉండిపోయారు.

జయలలిత ఇంట్లోకి శశికళ ప్రవేశించాక.. అక్కడ పనిచేసేవారిని కూడా తన సొంత ఊరు మన్నార్ గుడి నుంచే శశికళ అక్కడికి రప్పించారు.

మోడీనే ఆ విషయం చెప్పారంటారు..:

మోడీనే ఆ విషయం చెప్పారంటారు..:

జయతో ఉన్న అనుబంధాన్ని ఆసరాగా చేసుకుని.. ఆమెకు తెలియకుండా తెరవెనుక శశికళ చాలానే తతంగం నడిపించారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ ఆ వివరాలను జయకు పంపించినట్టుగా చెబుతుంటారు.

మొత్తానికి ఆ సమాచారంతో అగ్గి మీద గుగ్గిలం అయిన జయలలిత.. శశికళతో సహా మన్నార్ గుడి మాఫియా మొత్తాన్ని ఇంటినుంచి తరిమేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో జయలలితే స్వయంగా మళ్లీ ఆమె పోయెస్ గార్డెన్ లోకి ఆహ్వానించారు.

ఇక అప్పటినుంచి జయకు నెచ్చెలిగా.. ఆమె నీడలా వెన్నంటే తిరిగారు శశికళ. జయలలిత అనూహ్య మరణంతో.. అనూహ్య పరిణామాల నడుమ.. ఇప్పుడు సీఎం స్థాయికి ఎదిగారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+