ఆమె కౌగిలింతల వ్యాపారం అదుర్స్: లక్షలు సంపాదిస్తోంది!(పిక్చర్స్)
అమెరికా టెక్సాస్ రాష్ట్రం శాన్‌అంటోనియోకు చెందిన ఓ మహిళ సరదాగా, సేవా భావంతో మొదలు పెట్టిన కౌగిలింతల ప్రక్రియను.. ఇప్పుడు పూర్తిగా వ్యాపారంగా మార్చేసింది.
న్యూయార్క్: అమెరికా టెక్సాస్ రాష్ట్రం శాన్‌అంటోనియోకు చెందిన ఓ మహిళ సరదాగా, సేవా భావంతో మొదలు పెట్టిన కౌగిలింతల ప్రక్రియను.. ఇప్పుడు పూర్తిగా వ్యాపారంగా మార్చేసింది. తన కౌగిలింతలతో పలువురు ఓదార్చుతూ, వారిలో సాంత్వన కలిగిస్తూ నాలుగు కాదు.. లక్షల్లో సంపాదిస్తోంది.

ఆ వివరాల్లోకి వెళితే..
జనెత్ ట్రెవీనో (37).. సరదాగా, సేవా భావంతో ప్రారంభించిన కౌగిలింతలను పూర్తి వ్యాపారంగా మార్చింది. 40 నుంచి 70 ఏళ్ల పురుషులను గంటకు 80 డాలర్లు (దాదాపు రూ.5,500) ఫీజు తీసుకొని కౌగిలించుకుంటుంది.

డాలర్లను వెనకేసుకుంటోంది..
ఇలా కౌగిలించుకుంటూ వారానికి 1600 డాలర్లు (దాదాపు రూ. 1,09,000) సంపాదిస్తోంది. జెనెత్ భర్త కార్లోస్ కూడా ఇందుకు పూర్తిగా సహకరిస్తుండటం గమనార్హం..

సేవతోపాటు వ్యాపారం
‘ప్రజలకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించడం అవసరం. వారిని హృదయానికి దగ్గరగా తీసుకొని వారిలో నమ్మకాన్ని పెంచేలా చేస్తే వారిలో మంచి మార్పులు వస్తాయి. అందుకే నేను కౌగిలింత సేవలను అందిస్తున్నాను' అని తెలిపింది జనెత్.

డిమాండ్ పెరిగింది..
‘మొదట్లో పార్ట్ టైంగా ప్రారంభించిన ఈ కౌగిలింతల వ్యాపారానికి డిమాండ్ పెరగడంతో దానిని ఫుల్ టైంగా మార్చుకున్నాను. ఇందు కోసం కడ్డలిస్ట్.కామ్ అనే వెబ్ సైట్ ద్వారా కౌగిలింతలపై ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకున్నా' అని జెనెత్ తెలిపింది.

సెక్స్‌కు తావులేదు..
ఇటీవల ఓ కౌగిలింతల క్లబ్‌లో కూడా జెనెత్ చేరింది. ఇక్కడ సెక్స్‌కు తావు లేకుండా అందరూ ఒకరినొకరు కౌగిలించుకుంటారు. కాగా, ఈ వ్యాపారం బాగుండటంతో జనెత్ బాటలో నడిచేందుకు మరికొందరు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
వేసవిలో ఎక్కువగా ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications