5 రోజులు అక్కడ మహిళలు దుస్తులు వేసుకోరు, కారణమిదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

సిమ్లా: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వింత వింత ఆచారాలు, సంప్రదాయాలను కొనసాగిస్తుంటారు.అయితే ఈ ఆచారాలను కొనసాగించడం వెనుక ప్రత్యేక కారణాలుంటాయని చెబుతుంటారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటకులు ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతంలో సుందర ప్రదేశాలకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఈ రాష్ట్రానికి పర్యాటకుల ద్వారానే ఎక్కువగా ఆదాయం సమకూరుతోంది.

women dont wear clothes in Veena village five days in year

అయితే ఈ రాష్ట్రంలోని వీణా అనే గ్రామంలోని ప్రజల జీవనశైలి వింతగా ఉంటుంది. ఇప్పటికీ కూడ ఆ గ్రామస్తులు పురాతన కాలం నుండి వస్తున్న ఈ ఆచారాలను కొనసాగిస్తున్నారు.

ఏడాదిలో ఐదురోజులపాటు భర్తలు తమ భార్యలతో అస్సలు మాట్లాడరు. అంతేకాదు ఐదురోజులపాటు ఈ గ్రామస్తులు ఎవరూ కూడ మద్యం జోలికి వెళ్ళరు. అంతేకాదు మరో వింతైన ఆచారం ఏమిటంటే ఐదురోజులపాటు మహిళలు ప్రతి పనిని దుస్తులు లేకుండానే చేస్తారు. ఒకవేళ అలా చేయకపోతే అశుభమని భావిస్తారు.

పురాతన కాలం నుండి వస్తున్న ఈ ఆచారాలను కొనసాగించకపోతే గ్రామానికి కీడు వాటిల్లుతోందని గ్రామస్థులు నమ్ముతారు. అందుకే ఈ ఆచారాలను విశ్వసిస్తారు.

గతంలో ఈ ప్రాంతంలోకి రాక్షసులు ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేవారని స్థానికుల నమ్మకం.అయితే ఆ సమయంలో దేవతలు వచ్చి ఆ రాక్షసులను మట్టుబెట్టారు. ఈ కారణంగానే భద్రన్ సంక్రాంతి మాసాన్ని తమకు కీడు జరిగే మాసంగా వారు భావిస్తారు.వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఆ గ్రామస్థులు ఈ ఆచారాలను కొనసాగిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
women dont wear clothes in Veena village five days in year. villagers continues tradition for longtime.
Please Wait while comments are loading...