Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీ కామెంట్: రేణుకా చౌదరి రామాయణంలో ఎవరు?

Recommended Video

    Modi Satires on Renuka Chowdary : Going Viral in social media

    న్యూఢిల్లీ: రాజ్యసభ కాంగ్రెసు సభ్యురాలు రేణుకా చౌదరిపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రామాయణంలోని ఏ పాత్రతో రేణుకా చౌదరి సరిపోలుతారా, రామాయణంలోని ఏ పాత్రకు ఆమె సరిపోతారనేది మోడీ ఉద్దేశం అనే ప్రశ్నలు ముందుకు వచ్చాయి.

    ఆమెను ఏ పాత్రతో పోల్చారో స్పష్టత ఇవ్వకుండా ప్రధాని మోడీ రేణుకా చౌదరిపై వ్యాఖ్య చేశారు. బుధవారం రాజ్యసభలో తన ప్రకటనకు ఫక్కున నవ్విన రేణుకా చౌదరిని ఉద్దేశించి మోడీ వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే.

     మోడీ చేసిన ప్రకటన ఇదీ...

    మోడీ చేసిన ప్రకటన ఇదీ...

    రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు మోడీ బుధవారం రాజ్యసభలో జవాబిస్తూ వాజ్‌పేయి హయాంలో ఆధార్ కార్డుకు బీజం పడిందని అన్నారు. ఆ సమయంలో ఎవరో గట్టిగా నవ్విన శబ్దం వినిపించింది అంతా అటువైపు చూశారు.

     రేణుకా చౌదరి వైపు చూశారు...

    రేణుకా చౌదరి వైపు చూశారు...

    నవ్వు వినిపించిన వైపు సభ్యులంతా చూశారు. ఆ నవ్వు రేణుకా చౌదరిదని గుర్తించారు. ఈ సమయంలో చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుని - ఒక నిమిషం ప్రసంగాన్ని ఆపాలని ప్రధానికి సూచిచి రేణుకా చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైంది మీకు, ఇలాంటి ప్రవర్తన సరి కాదని అన్నారు.

    ప్రధాని ఇలా వ్యాఖ్య చేశారు...

    ప్రధాని ఇలా వ్యాఖ్య చేశారు...

    సభాపతీజీ.. రేణుకను అడ్డుకోకండి. రామాయణం సీరియల్ తర్వాత అంతటి నవ్వును వినే భాగ్యం మనకు ఈ రోజే దక్కిందని అన్నారు. దాంతో రామాయణంలోని ఏ పాత్రతో రేణుకా చౌదరిని పోల్చారనే చర్చ జరిగింది. అయితే, దానిపై నెటిజన్లు వ్యాఖ్యానిస్తూ - శూర్పనఖతో పోల్చారని అంటున్నారు.

    రేణుకా చౌదరి ఇలా అన్నారు...

    రేణుకా చౌదరి ఇలా అన్నారు...

    మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెసు మండిపడింది. మోడీ వ్యాఖ్యలపై స్పందించడానికి రేణుకా చౌదరి నిరారించారు. ప్రధాని మాటపై తాను స్పందించదలుచుకోలేదని, ఎందుకంటే ఆయనయ ఓ మహిళ ఔన్నత్యాన్ని దిగజార్చిన వ్యక్తి అని ఆమె అన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+