లగడపాటి సర్వే అంటూ హల్‌చల్: జగన్‌దే విజయం, పవన్ కల్యాణ్ థర్డ్?
Recommended Video

అమరావతి: ఓ సర్వే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వే అంటూ దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లగడపాటి చేయించిన సర్వేలకు విశ్వసనీయత ఉంటుందనే విషయం అందరికీ తెలుసు.
ఆయన చేయించి సర్వే అంచనా ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయించారని, తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆ సర్వేల్లో తేలిందని వార్తలు వచ్చాయి.
దానికి కౌంటర్‌గా లగడపాటి సర్వే అంటూ దీన్ని ప్రచారంలోకి తెచ్చారా తెలియదు. ఇది నిజమని పూర్తిగా నమ్మడానికి కూడా వీలు లేదు. సోషల్ మీడియాలో హచ్‌చల్ చేస్తోంది కాబట్టి చర్చనీయాంశంగా మారింది.

లగడపాటి సర్వే అంటూ ఇలా...
సోషల్ మీడియాలో సందడి చేస్తున్న కథనం ప్రకారం - విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రతి మూడు నెలలకు లేదా ఆరు నెలలకు ఓసారి సర్వే నిర్వహిస్తారట. ఆ సర్వే ప్రకారం 2019లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోతుందని సర్వే తేలిందట. ఇది తాజా సంచలన వార్తాంశం అంటూ ఫేస్‌బుక్‌లో ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్టు పెట్టిన పోస్టు హల్‌చల్ చేస్తోంది.

జగన్ పార్టీదే గెలుపు అంటూ..
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా అందులో ఉంది. జిల్లాలవారీగా తెలుగుదేశం, వైసిపి, జనసేన గెలుచుకునే సీట్ల సంఖ్యను కూడా ఇచ్చారు. జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 105 స్థానాలు, తెలుగుదేశం 51 స్థానాలు, పవన్ కల్యాణ్ జనసేన 19 స్థానాలు గెలుచుకుంటాయని అందులో చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ రకంగా పవన్ కల్యాణ్ మూడో స్థానంలోనే ఉంటారని చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఇలా...
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో తెలుగుదేశం 4, వైయయస్సార్ కాంగ్రెసు పార్టీ 5, జనసేన 1 సీట్లు గెలుచుకుంటాయని లగడపాటి సర్వే తేల్చిందంటూ ఓ పోస్టులో చెప్పారు.

విజయనగరం జిల్లాలో ..
- విజయనగరం మొత్తం సీట్లు - 9
- టీడీపీ గెల్చుకొనేవి - 2
- వైస్సార్సీపీ గెలిసేవి - 5
- జనసేన గెల్చుకొనేవి - 2
- మొత్తం సీట్లు - 15
- టీడీపీ గెల్చుకొనేవి - 6
- వైస్సార్సీపీ గెలిసేవి - 8
- జనసేన గెల్చుకొనేవి - 1
- మొత్తం సీట్లు - 19
- టీడీపీ గెల్చుకొనేవి - 2
- వైస్సార్సీపీ గెలిసేవి - 9
- జనసేన గెల్చుకొనేవి - 8
- మొత్తం సీట్లు - 15
- టీడీపీ గెల్చుకొనేవి - 5
- వైస్సార్సీపీ గెలిసేవి - 5
- జనసేన గెల్చుకొనేవి - 5
- మొత్తం సీట్లు - 16
- టీడీపీ గెల్చుకొనేవి - 5
- వైస్సార్సీపీ గెలిసేవి - 11
- జనసేన గెల్చుకొనేవి - 0
- మొత్తం సీట్లు - 17
- టీడీపీ గెల్చుకొనేవి - 10
- వైస్సార్సీపీ గెలిసేవి - 7
- జనసేన గెల్చుకొనేవి - 0
- మొత్తం సీట్లు - 12
- టీడీపీ గెల్చుకొనేవి - 3
- వైస్సార్సీపీ గెలిసేవి - 8
- జనసేన గెల్చుకొనేవి - 1
- మొత్తం సీట్లు - 10
- టీడీపీ గెల్చుకొనేవి - 2
- వైస్సార్సీపీ గెలిసేవి - 7
- జనసేన గెల్చుకొనేవి - 1
- మొత్తం సీట్లు - 10
- టీడీపీ గెల్చుకొనేవి - 0
- వైస్సార్సీపీ గెలిసేవి - 10
- జనసేన గెల్చుకొనేవి - 0
- మొత్తం సీట్లు - 14
- టీడీపీ గెల్చుకొనేవి - 4
- వైస్సార్సీపీ గెలిసేవి - 10
- జనసేన గెల్చుకొనేవి - 0
- మొత్తం సీట్లు - 14
- టీడీపీ గెల్చుకొనేవి - 4
- వైస్సార్సీపీ గెలిసేవి - 10
- జనసేన గెల్చుకొనేవి - 0
- మొత్తం సీట్లు - 14
- టీడీపీ గెల్చుకొనేవి - 4
- వైస్సార్సీపీ గెలిసేవి - 10
- జనసేన గెల్చుకొనేవి - 0

విశాఖపట్నం జల్లాలో ఇలా...

తూర్పు గోదావరి జిల్లాలో ఇలా..

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలా..

కృష్ణా జిల్లాలో ఇలా...

గుంటూరు జిల్లాలో ఇలా...

ప్రకాశం జిల్లాలో ఇలా..

నెల్లూరు జిల్లాలో ఇలా..

కడప జిల్లాలో ఇలా...

కర్నూలు జిల్లాలో ఇలా

అనంతపురం జిల్లాలో ఇాలా..

చిత్తూరు జిల్లాలో ఇలా...

దీన్ని నమ్మవచ్చా...
లగడపాటి రాజగోపాల్ స్వయంగా చెప్తే తప్ప దీన్ని నమ్మడానికి ఏమీ లేదు. రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో తమకు అనుకూలంగా పోస్టులు పెట్టేందుకు ప్రత్యేకంగా కొంత మందిని నియమించుకున్నాయి. నిజానికి, సోషల్ మీడియాలో పార్టీల మధ్య సమరంలాంటిది జరుగుతోంది. అందువల్ల ఈ సర్వే విశ్వసనీయత ఎంత అనేది చెప్పడం సాధ్యం కాదు. ఫలితాలపై ఓ అంచనాకు రావడానికి కూడా ప్రస్తుత తరుణంలో వీలు కాదు.












Click it and Unblock the Notifications