health tips:బరువు తగ్గడానికి మూడంటే 3 జ్యూస్ లు.. వారం రోజులు.. అంతే!
ప్రతి రోజూ టొమాటో రసం తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.
జీవన శైలిలో మార్పులు తీవ్రంగా చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వీటిల్లో ముఖ్యమైంది బరువు పెరగడం. దీనివల్ల పలువురు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతుండటమేకాకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆహారంలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యకరమైన జ్యూస్‌లు తాగితే బరువు తగ్గడంతోపాటు మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఈ జ్యూస్‌లు తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు:

క్యారెట్ జ్యూస్‌తో సులభంగా బరువు తగ్గుతారు:
ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్ తాగాలి. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. బరువు తగ్గడంతోపాటు డైటరీ ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఇది సులభవంగా ఆకలిని నియంత్రిస్తుంది.

టొమాటో రసం:
ప్రతి రోజూ టొమాటో రసం తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పీచు పదార్థాలు అధిక పరిమాణంలో ఉండటంవల్ల సులభంగా పొట్ట ఆరోగ్యంగా చేయడమేకాకుండా స్థూలకాయాన్ని తగ్గించడానికి ఉపయోపడుతుంది.

బీట్‌రూట్ జ్యూస్:
బరువు తగ్గాలనుకునే వారు బీట్‌రూట్ జ్యూస్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. శరీరానికి శక్తిని కలిగిస్తుంది. బీట్ రూట్ లో తక్కువ కేలరీలు లభిస్తాయి కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది












Click it and Unblock the Notifications