40 శాతం మహిళలను వేధిస్తున్న వ్యాధి.. ప్రతి స్త్రీకి ఇది తెలుసుండాలి!
Sexual Issues in Women: ఇటీవల కాలంలో మహిళలు పని, కుటుంబం, బాధ్యతల మధ్య తమ లైంగిక జీవితంపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. దీని వల్ల దాదాపు 40 శాతం మంది మహిళలు ఫిమేల్ సెక్సువల్ డిస్‌ఫంక్షన్(FSD) అనే వ్యాధితో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్య కేవలం శారీరకంగానే కాకుండా వారి మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
శృంగారం పట్ల ఆసక్తి ఎందుకు తగ్గుతుంది?
చాలా మంది మహిళలు శృంగారం పట్ల ఆసక్తి లేదని భావిస్తుంటారు. ఓ రీసెర్చ్ ప్రకారం.. 47 శాతం మంది మహిళలు తాము కోరుకున్నంతగా లైంగిక ఆనందాన్ని పొందడం లేదని అంగీకరించారు. దీనికి అనేక కారణాలు కూడా ఉండవచ్చు.
*ఒత్తిడి (Stress)
*ఆందోళన (Anxiety)
*డిప్రెషన్
*సరైన ఆహారం తీసుకోకపోవడం
*అధిక వ్యాయామం
*కొన్ని రకాల మందుల వాడకం

ఈ సమస్యలు భాగస్వాములకు మధ్య దూరం, ఒత్తిడిని పెంచుతాయి. కాబట్టి మంచి నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి.
ఆర్గాజం పొందలేకపోవడం
మరొక అధ్యయనం ప్రకారం.. చాలామంది మహిళలు శృంగారం సమయంలో ఆర్గాజం(లైంగిక ఉద్దీపన తర్వాత కలిగే తీవ్రమైన ఆనంద అనుభూతి) పొందలేకపోతున్నారు. 85 శాతం మంది మహిళలు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఆర్గాజం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అంగీకరించారు. ఇలాంటి సమస్య అప్పుడప్పుడు వస్తే సాధారణమే. కానీ, తరచుగా ఇబ్బందులు ఎదురైతే, అది ఫిమేల్ సెక్సువల్ డిస్‌ఫంక్షన్(FSD) సంకేతం కావచ్చు. కొన్నిసార్లు హార్మోనల్ పిల్స్ వాడకం వల్ల కూడా ఇలా జరగవచ్చు, కాబట్టి వైద్యుడిని సంప్రదించడం మంచిది.
లైంగిక సంబంధాల సమయంలో నొప్పి
కొంత మంది మహిళలు శృంగారం సమయంలో నొప్పిని అనుభవిస్తారు. దీని వల్ల వారు లైంగిక సంబంధాలకు దూరంగా ఉంటారు. వైద్య పరిభాషలో దీనిని 'డిస్పేరునియా' అని పిలుస్తారు. ఈ నొప్పికి వివిధ కారణాలు కూడా ఉండవచ్చు.
*ఇన్ఫెక్షన్లు
*పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్
*ఎండోమెట్రియోసిస్
*అండాశయ తిత్తులు
*యోని పొడిబారడం లేదా సరైన లూబ్రికేషన్ లేకపోవడం
మహిళలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. మహిళల లైంగిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడటం చాలా అవసరం. చాలా మంది దీనిపై చర్చించేందుకు సంకోచిస్తారు. మీరు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వాటిని నిర్లక్ష్యం చేయొద్దు. సరైన సమయంలో వైద్య సహాయం తీసుకోవడం వల్ల సంబంధాలు మెరుగుపడటమే కాకుండా ఆత్మవిశ్వాసం, ఆనందం కూడా పెరుగుతాయి.












Click it and Unblock the Notifications