అత్యంత చవకైన డ్రైఫ్రూట్స్ ఇవి

ఉరుకులు పరుగులతో కూడిన జీవితంలో ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. అందుకు పోషకాహారం తీసుకోవడం ముఖ్యం. కరోనా వచ్చిన తర్వాత సమాజంలో డ్రైఫ్రూట్స్ వినియోగం బాగా పెరిగింది. అయితే ఇవి చాలా ఖరీదుతో ఉండటంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి. శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుకోవడానికి వ్యాయామం చేయడం కూడా ఎంతో ముఖ్యం.

ఫిట్ నెస్ బాగుంటే ఎంతమందిలో ఉన్నా మీరు ప్రత్యేకంగా నిలుస్తారు. కండరాలు కూడా బలోపేతమవుతాయి. ప్రతిరోజూ కష్టపడి పనిచేసినప్పటికీ కండరాలు పెరగలేకపోతే అందుకు కొన్ని చవకైన డ్రై ఫ్రూట్స్ తోడుగా నిలుస్తాయి. వాటిగురించి తెలుసుకుందాం.

5 cheap dry fruits for strong muscles

వేరుశెనగ: జింక్, కాల్షియం, విటమిన్ E, విటమిన్ B6 లకు వేరుశెనగ మంచి మూలం. శక్తిని పెంచడంలో ఇవి ప్రభావవంతంగా ఉంటాయి. పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. కండరాల పెరుగుదలను పెంచడానికి వేరుశెనగ తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

పిస్తా: ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐరన్, పీచు, విటమిన్ సి, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడాన్ని చాలామంది ఇష్టపడతారు. రెగ్యులర్ డైట్‌లో పిస్తా చేర్చుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి. కండరాల పెరుగుదల బాగుంటుంది.

గుమ్మడికాయ గింజలు: ఈ గింజల్లో ఖనిజాలు, విటమిన్లు, అధిక పీచుపదార్థాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలం. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ బారి నుంచి రక్షిస్తాయి. అంతేకాదు.. రోగనిరోధకశక్తిని పెంచి శరీరాన్ని వ్యాధుల బారినుంచి సురక్షితంగా ఉంచుతాయి. ప్రతిరోజు వీటిని తీసుకోవడంవల్ల కండరాలు దృఢంగా మారతాయి. ఎదుగుదల కూడా బాగుంటుంది.

ఎండు అత్తి పండ్లు: మెగ్నీషియం, జింక్, పొటాషియం, విటమిన్ B6, కాల్షియం, ఐరన్ ఉంటాయి, కండరాల బలహీనతను తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మంచి శక్తినిస్తాయి. నానబెట్టిన అత్తి పండ్లను తినడం వల్ల శరీరానికి ఎంతో శక్తి సమకూరుతుంది.

మఖానా: మెగ్నీషియం, ఫైబర్, జింక్, ఐరన్, పొటాషియం ఉంటాయి. పురుషులతో పాటు, గర్భధారణ సమయంలో స్త్రీలకు ఎంతో ప్రయోజనకరం. రాత్రిపూట పాలల్లో మఖానా కలిపి తింటే శరీరంలోని బలహీనత తొలగిపోతాయి. కండరాలు వృద్ధి చెందుతాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+