'బ్యాచిలర్ ఫ్రైడ్ రైస్'.. కర్రీ లేకుండానే సూపర్ టేస్ట్.. 5 నిమిషాల్లోనే తయారీ..
బ్యాచిలర్ బాయ్స్ వంట చేసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. ఉద్యోగ, ఉపాధి వేటలో ఉన్న యువత సమయం లేకపోవడంతో బయటే తింటూ ఉంటారు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే వారికోసం ఇది సూపర్ రెసిపీ అని చెప్పొచ్చు. సాధారణంగా ఫాస్ట్ ఫుడ్ కు బాగా అలవాటు పడిన యువత.. ఇప్పుడు ఇంట్లోనే ఎంచక్కా ఫ్రైడ్ రైస్ ను తయారు చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లోనే ఈ వంట చేసుకోవచ్చు. కర్రీ కూడా అవసరం లేదు. అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ బ్యాచిలర్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి..?
బ్యాచిలర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి గల పదార్థాలు ఓసారి చూస్తే.. పనీర్, ఉడికిన అన్నం, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కొత్తిమీర, నూనె, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాల పొడి, ధనియాల పొడి, నిమ్మకాయ.. ఈ పదార్థాలతో సూపర్ టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ ను ఐదు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు.
బ్యాచిలర్ ఫ్రైడ్ రైస్ చేసే విధానంలో ముందుగా.. 50 గ్రాముల పనీర్, ఒక ఉల్లిపాయ, 3 పచ్చి మిర్చి తీసుకుని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంచు అల్లం ముక్క, 3 వెల్లుల్లి, అరకప్పు కొత్తిమీర, గుప్పెడు పుదీనా రోట్లో వేసుకుని మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా నూరుకోవాలి. ఆ ముద్దను పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి 3 స్పూన్ ల నూనె పోయాలి. మరిగిన నూనెలో ఇంచు దాల్చినచెక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేయాలి. అవి ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, మిర్చిని అందులో వేయాలి. అలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి దోరగా వేయించాలి.

అందులో పావు స్పూన్ పసుపు, అల్లం ముద్ద, హాఫ్ స్పూన్ మిరియాలపొడి, హాఫ్ స్పూన్ ధనియాలపొడి వేసుకోవాలి. అలా కొద్దిసేపు అల్లం పచ్చివాసన పోయేదాక మరిగించి ఆ తర్వాత పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి. పన్నీర్ ముక్కులు వేశాక సువాసన వస్తుంటుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాక అందులో 2 కప్పుల అన్నం వేయాలి. పూర్తిగా కలిసేలా మిక్స్ చేయాలి. అలా రెండు నుంచి మూడు నిమిషాలు ఉంచి చివరిలో నిమ్మరసం పిండుకుని దించేయాలి. సూపర్ టేస్టీ పూదీనా ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. ఎలాంటి కర్రీ లేకుండానే దీన్ని డైరెక్ట్ గా తినేయొచ్చు. బ్యాచిలర్స్ కు ఇది మంచి రెసిపీ. ఐదు నిమిషాల్లోనే చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications