బీపీ బాధితులకు ఇక రోజూ మాత్రలు అవసరం లేదు, రెండే ఇంజెక్షన్లతో చెక్..!!
హైబీపీ. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న సమస్య. అధిక రక్తపోటు ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. అధిక రక్తపోటు కారణంగా గుండె పోట్లు, బ్రెయిన్ స్ట్రోక్ తో పాటుగా అనేక ప్రాంణాంతక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అధిక రక్త పోటు ఉన్నవారికి చికిత్స.. నిరంతరం మందులు అవసరం. వైద్యుల సూచన మేరకు మందులను క్రమం తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. అయితే, జీవనశైలిలో కొన్ని మార్పులతోనూ బీపీ నియంత్రణలో ఉంచుకోవచ్చు. కాగా.. ఇప్పుడు మందు మందులు నిరంతరం వాడే వారి కోసం ఏడాదికి రెండు ఇంజెక్షన్లతో బీపీ నియంత్రించే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
అధిక రక్తపోటు ఉన్నవారికి నిరంతరం బీపీ చెక్ చేసుకోవటం అవసరం. బీపీ స్థాయిలకు గుర్తించి అందుకు అనుగుణంగా వైద్యులు వారికి మందులు సూచిస్తారు. అదే సమయంలో జీవనశైలిలో నూ మార్పులు అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి బీపీని కంట్రోల్ చేసుకోవడానికి సహక రిస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్లు పుష్క లంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ తగ్గాలంటే ఉప్పు వాడకం తగ్గించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ సోడియం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఒత్తిడిని కూడా తగ్గించుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడా నికి ధ్యానం, యోగా లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయాలి. అదే సమయంలో వైద్యులు సూచించిన విధంగా నిరంతరం మందులు క్రమం తప్పకుండా వాడాలి.

సంవత్సరానికి రెండు ఇంజెక్షన్లతో చెక్












Click it and Unblock the Notifications