అల్లు అర్జున్ ఫేవరెట్ ఫుడ్ ఇదే.. ఎలా చేయాలంటే ???

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో గంగోత్రి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అల్లు రామలింగయ్య.. అల్లు అరవింద్ ల.. వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తనదైన శైలిలో నటన, డ్యాన్స్ తో అందరినీ అలరించారు. నేషనల్ అవార్డు కైవసం చేసుకుని పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు. అలా వైకుంఠపురంలో సినిమాతో తెలుగులో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాస్తే.. పుష్ప సినిమాతో ఇండియన్ సినిమా రికార్డు లను తిరగరాశారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మూవీ చేస్తున్నారు. నేడు బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రానికి 'రాకా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ క్రమంలోనే ఆయన బర్త్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భం గానే అల్లు అర్జున్ ఫేవరెట్ ఫుడ్ గురించి జోరుగా చర్చ నడుస్తోంది.

allu-arjun-favourite-food-chicken-biryani-making-recipe-in-telugu-with-easy-steps-and-tips

ఇంతకీ అల్లు అర్జున్ ఫేవరెట్ ఫుడ్ ఏంటని అనుకుంటున్నారా.. అదే బిర్యానీ.. బన్నీకి బిర్యానీ అంటే చాలా ఇష్టం అని ఆయన భార్య స్నేహా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అయితే చికెన్ అంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో ఎన్నో రకాలు ఉన్నా కానీ.. కొత్తగా మళ్లీ పూటకో రకం పుట్టుకొస్తూనే ఉంటాయి. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

చికెన్ థమ్ బిర్యానీ తయారీ విధానం..

కావలసిన పదార్థాలు..

  • చికెన్ - 500 గ్రాములు (ఎముకలతో ఉంటే ఇంకా టేస్టీ)
  • బాస్మతి బియ్యం - 500 గ్రాములు (30 నిమిషాలు నానబెట్టాలి)
  • పెరుగు - 1 కప్పు
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
  • కారం - తగినంత
  • పసుపు - ½ టీస్పూన్
  • గరం మసాలా - 1 టీస్పూన్
  • బిర్యానీ మసాలా - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర, పుదీనా - ఒక ముద్ద
  • షాజీరా - 1 టీస్పూన్
  • దాల్చిన చెక్క - 2 ముక్కలు
  • లవంగాలు - 4-5
  • ఇలాచీ - 3
  • బిర్యానీ ఆకు - 2
  • వేయించిన ఉల్లిపాయలు
  • నెయ్యి లేదా నూనె
  • కుంకుమపువ్వు (ఐచ్చికం - రుచి & కలర్ కోసం)
  • పాలు (కుంకుమపువ్వు కోసం)

తయారీ విధానం..

1. చికెన్ మ్యారినేషన్

ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలపాలి.

ప్రో టిప్: కనీసం 1 గంట, వీలైతే ఫ్రిజ్‌లో 4 గంటలు మ్యారినేట్ చేస్తే రుచి మరింత పెరుగుతుంది.

2. అన్నం ఉడికించడం

ఒక పెద్ద పాత్రలో నీటిని మరిగించి అందులో మొత్తం మసాలాలు (బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ, షాజీరా) వేసాలి. నీరు మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసి 70-80% వరకు ఉడికించాలి.

గమనిక: బియ్యం పూర్తిగా మెత్తగా కాకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి.

3. ఉల్లిపాయలు వేయించడం

సన్నగా తరిగిన ఉల్లిపాయలను నూనెలో గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. (ఇవే బిర్యానీకి అసలైన సువాసన, స్వీట్ టేస్ట్ ఇస్తాయి)

4. లేయరింగ్

మందపాటి గిన్నెలో:

మొదట మ్యారినేట్ చేసిన చికెన్ పరచాలి

దానిపై సగం ఉడికిన అన్నం వేసాలి

పైన వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా చల్లాలి

కొద్దిగా నెయ్యి, కుంకుమపువ్వు పాలు వేసుకోవచ్చు

ఇదే విధంగా మరో పొర కూడా వేయవచ్చు.

5. దమ్ ప్రాసెస్

గిన్నెను గట్టిగా మూతపెట్టి, ఆవిరి బయటకు రాకుండా గోధుమపిండితో సీల్ చేయాలి.

మొదట 5 నిమిషాలు హై ఫ్లేమ్

తరువాత 15-20 నిమిషాలు లో ఫ్లేమ్

టిప్: కింద తవా పెట్టి దమ్ చేస్తే కాలిపోదు.

6. చివరి స్టెప్

స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయకూడదు.

10-15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత నెమ్మదిగా కలపాలి.

సర్వింగ్ సూచనలు..

వేడిగా రయితాతో వడ్డిస్తే సూపర్ టేస్ట్

సలాడ్, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో ఇంకా బెటర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+