కలబంద మంచిదని తెగ వాడేస్తున్నారా?
కలబంద ఎటువంటి పరిచయం అవసరంలేని సహజసిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన ఆయుర్వేద మొక్క. కలబందతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే. కలబంద చర్మ సంరక్షణకు, జుట్టు సంరక్షణకు దోహదం చేస్తుందని చెబుతారు. సాధారణంగా కలబందను కాలిన గాయాలకు, చర్మ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేకాదు కలబంద షుగర్ ను కంట్రోల్ చేయడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా దోహదం చేస్తుంది.
కలబందను తప్పుగా వాడితే ఈ సమస్యలు
అయితే అటువంటి కలబందను అధికంగా వినియోగించడం లేదా సరైన పద్ధతిలో వినియోగించకపోవటం ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా అధికంగా లేదా తప్పుగా కలబందను ఉపయోగించినప్పుడు ఇది చర్మంపైన అలర్జీ, దురద, దద్దుర్లు లేదా చిరాకును కలిగిస్తుంది. కొంతమంది నోటి ద్వారా కూడా కలబందను తీసుకుంటారు. అయితే ముఖ్యంగా కలబంద జెల్ లో ఉండే పసుపు రంగు పాలు విరోచనాలు, కడుపునొప్పి మరియు కడుపు తిమ్మిరి వంటి సమస్యలకు కారణంగా మారతాయి.

కలబంద వినియోగంతో ఈ ఇబ్బందులు కూడా
కలబందను అధికంగా వినియోగించినా, లేదా తప్పుగా వినియోగించిన జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కలబందను వినియోగించాలి అనుకుంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎటువంటి సమస్య రాకుంటేనే కలబందను ఉపయోగించాలి. గర్భంతో ఉన్నవారు కలబందను తీసుకోకుండా ఉంటేనే మంచిది. కలబంద రసం గర్భాశయ కుదుళ్ళ పైన ప్రభావాన్ని చూపి సమస్యలు కలిగించే అవకాశం ఉంటుంది.
కలబందతో ఈ అనారోగ్యాలు
కాబట్టి గర్భిణీ స్త్రీలు డాక్టర్ సలహా లేకుండా కలబందను తీసుకోకూడదు. కలబంద జ్యూస్ ను ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల పైన ఒత్తిడి పెరిగి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ మందులు తీసుకునేవారు కలబంద రసాన్ని ఎక్కువగా తాగకూడదు. ఒక్కోసారి అది హైపోగ్లైసీమియా కు కారణం అవుతుంది.
అతిగా జుట్టుకు వాడితే జుట్టు రాలిపోయే ప్రమాదం
జుట్టుకు కూడా కలబందను అతిగా వాడితే హెయిర్ ఫాల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక సన్ బర్న్ సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా కలబందను తీసుకోకూడదు. దీనివల్ల ఇరిటేషన్, చర్మం ఇంకా ఎక్కువగా నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక కలబంద వాడాలనుకుంటే పరిమిత మోతాదులో, పద్దతిలో వాడాలి.












Click it and Unblock the Notifications