కాల్చిన మొక్కజొన్న తింటున్నారా? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి.

వర్షాకాలంలో వేడివేడి కాల్చిన మొక్కజొన్న (Roasted Corn) తినడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదా! కానీ, దీని వెనుక దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా? కాల్చిన మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో మేలు చేస్తాయి. ఇది పౌష్టికమైన ఆహారంగా మాత్రమే కాకుండా, రుచికరమైన తినుబండారంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇది విటమిన్లు, ఖనిజాల కలయికతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

1. అధిక మోతాదులో ఫైబర్
కాల్చిన మొక్కజొన్నలో మేలైన పీచు (Dietary Fiber) పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో కూడా ఇది సహాయపడుతుంది. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది.

Amazing Health Benefits of Eating Roasted Corn You Need to Know

2. హృదయ ఆరోగ్యానికి మేలు
ఇందులో ఉండే మంచి కొవ్వులు, ఫైటోన్యూట్రియెంట్లు రక్తనాళాల కాఠిన్యాన్ని తగ్గిస్తాయి. ఇది హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మొక్కజొన్నలో ఉన్న సహజ కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. ఇది ప్రత్యేకంగా శారీరకంగా శ్రమ చేసే వారికి ఎంతో ఉపయోగకరం.

3. యాంటీ ఆక్సిడెంట్లు
మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. చర్మానికి ఆరోగ్యకరమైన కాంతి అందించడంలో కూడా ఇది సహాయపడుతుంది. కాల్చిన మొక్కజొన్నలో కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

4. రోగ నిరోధక శక్తి పెంపు
కాల్చిన మొక్కజొన్నలో విటమిన్ సి (Vitamin C) ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలపరచడంలో సహాయపడుతుంది. దీనిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. షుగర్ రోగులు దీన్ని మితంగా తీసుకుంటే లాభపడతారు.

5. బరువును అదుపులోకి
కాల్చిన మొక్కజొన్నలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది పొట్ట నిండిన భావనను కలిగిస్తే, బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి ఇది సరైన ఆహారంగా మారుతుంది. అయితే వీటిని మితంగానే తీసుకోవడం ఆరోగ్యకరం. కానీ కొన్నిసార్లు మొక్కజొన్న తిన్నప్పుడు పీచు మోతాదుతో జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.

కాల్చిన మొక్కజొన్న పౌష్టిక విలువలతో నిండిపోయి ఉంటుంది. ఇది ఆరోగ్యం మెరుగుపరచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జ్యూసులు, స్నాక్స్ స్థానంలో కాల్చిన మొక్కజొన్నను తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఉత్తమ ఎంపిక. మొక్కజొన్నను పిండి చేసి, దోసెలు, ఇడ్లీలు తయారు చేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+